హైదరాబాద్‌లో(Hyderabad) భూముల ధరలు (Land Prices) రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా రాయదుర్గం (Raidurgam) ప్రాంతంలో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన భూముల ఆన్లైన్ వేలంలో(Online Land Auction) ఎకరా భూమి (Per Acre Land) ఏకంగా రూ.264 కోట్ల ధర పలికింది. దీంతో రాయదుర్గం భూముల ధర మరోసారి రికార్డు స్థాయికి చేరింది.
రాయదుర్గంలోని పాన్ మక్తా(Pan Maktha) ప్రాంతంలో ఉన్న సర్వే నంబర్ 83/1లోని 5.25 ఎకరాల భూమిని TGIIC ఆన్లైన్ వేలం ద్వారా విక్రయానికి ఉంచింది. ఈ భూమికి అధికారులు ఎకరాకు కనీస ధరను రూ.175 కోట్లుగా నిర్ణయించారు. వేలంలో పాల్గొనే బిడ్డర్లకు రూ.10 కోట్ల డిపాజిట్‌ను నిర్దేశించారు.
ఖరీదైన ప్రాంతంలో ఉన్న భూమి కావడంతో స్థిరాస్తి సంస్థలు వేలంలో పోటీపడి బిడ్లు దాఖలు చేశారు. చివరకు ఎకరా భూమికి రూ.264 కోట్ల ధర పలికింది. దీంతో హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన భూముల వేలంలో రాయదుర్గం మరోసారి ప్రత్యేకంగా నిలిచింది.
ఇదే ప్రాంతంలో సుమారు మూడు నెలల క్రితం నిర్వహించిన భూముల వేలంలో ఎకరా రూ.237 కోట్ల ధర పలికింది. తాజాగా అదే ప్రాంతంలో ఎకరా ధర రూ.264 కోట్లకు చేరడంతో భూముల విలువ గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో ఐటీ, వాణిజ్య, మౌలిక వసతుల అభివృద్ధితో రాయదుర్గం, పాన్ మక్తా వంటి ప్రాంతాల్లో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. TGIIC నిర్వహిస్తున్న భూముల వేలంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు (Leading Real Estate Companies) పోటీ పడుతుండటంతో ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. తాజా వేలంలో ఎకరాకు రూ.264 కోట్ల ధర పలకడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో కీలక రికార్డుగా నిలిచింది.








