మేయ‌ర్ సీటు వివాదం.. జనసేనలో ముసలం

మేయ‌ర్ సీటు వివాదం.. జనసేనలో ముసలం

Summarize with AI

ఏపీలో స్థానిక సంస్థ‌లు(Local Bodies), మున్సిపాలిటీ(Municipality), కార్పొరేష‌న్ (Corporation) ఎన్నిక‌లు (Elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కూట‌మి పార్టీల్లో వాటాల(Seat Sharing) గోల మొద‌లైన‌ట్లుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మచిలీపట్నం (Machilipatnam) జనసేన (Jana Sena) పార్టీలో మేయర్‌ (Mayor) పదవి ఎంపిక వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ముంద‌స్తుగా నిర్వ‌హిస్తున్న పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) పుట్టినరోజు వేడుకల సందర్భంగా మచిలీపట్నం మేయర్‌గా బండి రామకృష్ణ (Bandi Ramakrishna) పేరును ప్రకటించడంపై పార్టీలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరినీ సంప్రదించకుండా మేయర్‌ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎలా ఎంపిక చేస్తారంటూ కొందరు నాయకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

మేయర్‌ పదవికి బండి రామకృష్ణను ఎంపిక చేస్తూ కొందరు నాయకులు సంతకాలు చేయడంపై జనసేన నేత కొట్టే వెంకట్రావు(Kotte Venkatravu) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలోని నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల అభిప్రాయాలను తీసుకోకుండా ఏకగ్రీవ తీర్మానం చేయడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం.

కేవలం కొంతమంది నాయకులు సంతకాలు చేసినంత మాత్రాన దానిని పార్టీ ఏకగ్రీవ నిర్ణయంగా పరిగణించలేమని వెంకట్రావు, మేయర్‌ పదవిపై అన్ని వర్గాల నాయకులు, ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం.

మేయర్‌ పదవి ఎంపిక విషయంలో పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో మచిలీపట్నం జనసేనలో అంతర్గత విభేదాలు బహిర్గతమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలు మేయర్‌ అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఏకగ్రీవ తీర్మానం వెనుక కారణమేంటన్న అంశంపైనా చర్చ సాగుతోంది.

మచిలీపట్నం మేయర్‌ పదవిని ఎవరికీ కేటాయించాలన్న అంశంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్థానిక నాయకుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటుందా? లేక ఇప్పటికే చేసిన ఏకగ్రీవ తీర్మానానికే ఆమోదం తెలుపుతుందా? అనేది వేచి చూడాల్సి ఉంది. మేయర్‌ అభ్యర్థి ఎంపిక వ్యవహారం మచిలీపట్నం జనసేనలో కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని విభేదాలకు ముగింపు పలుకుతుందా అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment