గ్రీస్‌లో అనిరుధ్‌–కావ్య పెళ్లి.. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌

Summarize with AI

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నిన్న బుధ‌వారం గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో పాటు తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ కుటుంబం, ఇత‌ర‌ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనిరుధ్‌ తన వివాహానికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. జీవితంలో ఒక్కసారే వచ్చే ప్రత్యేక సందర్భంగా అభివర్ణిస్తూ పెళ్లి ఫొటోల‌ను ఎక్స్‌, ఇన్‌స్టాలో పోస్టు చేయ‌గా, అవి ట్రెండింగ్‌లో ఉన్నాయి.

తమిళంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ అనిరుధ్‌ సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ఫ్రాంచైజీతో కావ్యా మారన్‌ క్రికెట్ అభిమానులకు సుపరిచితురాలు. వీరిద్దరి వివాహ వార్త సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment