ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) పట్టణ స్థానిక సంస్థల (Urban Local Bodies) ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన మైలురాయి నమోదైంది. రాష్ట్రంలోని 17 నగరపాలక సంస్థలు (మున్సిపల్ కార్పొరేషన్లు)(Municipal Corporations), 106 పురపాలక సంఘాల్లో(Municipalities) (మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు) రిజర్వేషన్లకు సంబంధించి పురపాలక శాఖ (Municipal Administration Department) చేపట్టిన సుదీర్ఘ కసరత్తు కొలిక్కి వచ్చింది. జనాభా నిష్పత్తి(Population Ratio), నిబంధనలు మరియు రొటేషన్ పద్ధతి (Rotation System) ఆధారంగా ఖరారు చేసిన ఈ రిజర్వేషన్ల తుది జాబితాను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది.
17 నగరపాలక సంస్థల (కార్పొరేషన్ల) మేయర్ రిజర్వేషన్లు
రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లకు (Municipal Corporations) సంబంధించి కేటాయించిన మేయర్ స్థానాల వివరాలు:
ఎస్టీ – జనరల్: మంగళగిరి – తాడేపల్లి
ఎస్సీ – మహిళ: కర్నూలు
ఎస్సీ – జనరల్: రాజమహేంద్రవరం
బీసీ – మహిళ: మచిలీపట్నం, కాకినాడ
బీసీ – జనరల్: చిత్తూరు, అనంతపురం, ఏలూరు
జనరల్ – మహిళ: శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైఎస్సార్ కడప, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC)
అన్రిజర్వ్డ్ (ఓపెన్): విజయవాడ, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు
106 పురపాలక సంఘాల ఛైర్పర్సన్ రిజర్వేషన్లు (Chairperson Posts)
ఎస్టీ – మహిళ: గూడూరు
ఎస్టీ – జనరల్: ఆత్మకూరు, ఆలూరు
ఎస్సీ – మహిళ: కొండపల్లి, నిడదవోలు, ఏలేశ్వరం, చింతలపూడి, సూళ్లూరుపేట, గుత్తి, చీరాల
ఎస్సీ – జనరల్: ఉయ్యూరు, నూజివీడు, కుప్పం, సామర్లకోట, పిఠాపురం, బాపట్ల, పొదిలి
బీసీ – మహిళ: జంగారెడ్డిగూడెం, నర్సీపట్నం, నాయుడుపేట, చిలకలూరిపేట, ఇచ్ఛాపురం, కొవ్వూరు, పాలకొల్లు, గుంతకల్లు, గుడివాడ, నందిగామ, ముమ్మిడివరం, మదనపల్లె, నరసరావుపేట, అమలాపురం
బీసీ – జనరల్: కావలి, కదిరి, బి.కొత్తకోట, కందుకూరు, హిందూపురం, ఆత్మకూరు (నెల్లూరు), అద్దంకి, కమలాపురం, నెల్లిమర్ల, మడకశిర, ఆళ్లగడ్డ, గురజాల, దాచేపల్లి, గొల్లప్రోలు, మార్కాపురం, నంద్యాల, బేతంచెర్ల, నందికొట్కూరు, దర్శి, గూడూరు (కర్నూలు), మైదుకూరు, బద్వేలు
జనరల్ – మహిళ: కనిగిరి, వెంకటగిరి, నరసాపురం, పలాస-కాశీబుగ్గ, పెడన, పలమనేరు, జమ్మలమడుగు, ఆకివీడు, పాలకొండ, పొన్నూరు, భీమవరం, జగ్గయ్యపేట, బుచ్చిరెడ్డిపాళెం, ఎర్రగుంట్ల, యలమంచిలి, కల్యాణదుర్గం, ఆమదాలవలస, పుంగనూరు, మాచర్ల, రాజంపేట, ఆదోని, డోన్, రాజాం, బొబ్బిలి, రేపల్లె, పులివెందుల, ఎమ్మిగనూరు
అన్రిజర్వ్డ్ (ఓపెన్): పుట్టపర్తి, పెనుకొండ, రాయచోటి, సాలూరు, తణుకు, తెనాలి, తాడేపల్లిగూడెం, రామచంద్రాపురం, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, తుని, పార్వతీపురం, ప్రొద్దుటూరు, పుత్తూరు, మండపేట, నగరి, చీమకుర్తి, తిరువూరు, రాయదుర్గం, గిద్దలూరు, వినుకొండ, పెద్దాపురం, ధర్మవరం, తాడిగడప, పిడుగురాళ్ల, తాడిపత్రి.
ఈసారి పురపాలక ఎన్నికల్లో కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునేలా ప్రత్యక్ష ఎన్నికల విధానం తెచ్చిన నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.
రిజర్వేషన్లు అధికారికంగా ఖరారవ్వడంతో ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు, స్థానిక నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి, ముమ్మర ప్రచారానికి సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్ల జాబితా గెజిట్ నోటిఫికేషన్‌గా వెలువడిన వెంటనే ఎన్నికల సంఘం తుది షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.








