‘జంతర్ మంతర్’ ఇక నిరసన వేదిక కాదు.. సంచలన నిర్ణయం

'జంతర్ మంతర్' ఇక నిరసన వేదిక కాదు.. సంచలన నిర్ణయం

Summarize with AI

దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) ప్రజాస్వామ్య(Democracy) గొంతుకలను నొక్కేసే దిశగా మరో సంచలన నిర్ణయం వెలువడింది. దశాబ్దాలుగా ఉద్యమాలు, ధర్నాలకు గుండెకాయలా నిలిచిన చారిత్రక ‘జంతర్ మంతర్’ను(Jantar Mantar) అధికారిక నిరసన వేదికల జాబితా నుంచి తొలగిస్తూ (డీ-నోటిఫై చేస్తూ) ఢిల్లీ పోలీసులు (Delhi Police) ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ భవనం, అత్యున్నత కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని నిషేధించడం ద్వారా ప్రభుత్వాలు (Governments) ప్రజల నిరసనలకు మరింత దూరం జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

భారతదేశంలో(India) నిరసనల చరిత్ర ఎప్పుడూ ఒకచోట నిలకడగా లేదు. 1988లో కిసాన్ నేత మహేంద్ర సింగ్ తికాయత్ (Mahendra Singh Tikait) ఆధ్వర్యంలో ఇండియా గేట్ సమీపంలోని ‘బొట్ క్లబ్'(Boat Club) వద్ద జరిగిన భారీ రైతు ఉద్యమం అప్పట్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని (Rajiv Gandhi Government) వణికించింది. అయితే, భద్రత, ట్రాఫిక్ కారణాలరీత్యా ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని నిషేధించి, ‘జంతర్ మంతర్’ను ప్రధాన నిరసన వేదికగా మార్చారు.

గత మూడు దశాబ్దాలుగా అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి రెజ్లర్ల ఆందోళనల వరకు అన్ని ప్రజా పోరాటాలకు జంతర్ మంతర్ వేదికైంది. ప్రభుత్వాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ ప్రాంగణాన్ని ఇప్పుడు పూర్తిగా రద్దు చేశారు.

కేంద్ర హోంశాఖ నియమించిన కమిటీ సిఫార్సుల మేరకు, జంతర్ మంతర్‌కు ప్రత్యామ్నాయంగా ఢిల్లీ పోలీసులు నూతనంగా రామ్‌లీలా మైదాన్(Ramlila Maidan), బురారీ మైదాన్(Burari Maidan), సీబీడీ మైదాన్(CBD Maidan) మూడు ప్రాంతాలను కేటాయించారు.

ప్రభుత్వ కేంద్రాలకు అతి సమీపంలో నిరసన తెలిపే అవకాశం లేకుండా, నగరానికి దూరంగా ఉండే ఈ మైదానాలను కేటాయించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కొత్త ప్రదేశాలలో ఆందోళనలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం దేశ రాజధానిలో ఎన్నికల జాబితాల సవరణ వివాదాలు, పలు కీలక ప్రజా సమస్యలపై విపక్షాలు, వివిధ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం గమసార్హం. పార్లమెంట్, ప్రభుత్వ కార్యాలయాలకు దూరంగా నిరసనలను నెట్టేయడం ద్వారా ప్రజల గొంతును ప్రభుత్వాలు పట్టించుకోకుండా తప్పించుకోవాలని చూస్తున్నాయని, ఇది మునుపెన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని విశ్లేషకులు మండిపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment