పడవ బోల్తా.. 109 మంది దుర్మ‌ర‌ణం

పడవ బోల్తా.. 109 మంది దుర్మ‌ర‌ణం

Summarize with AI

తూర్పు ఆఫ్రికాలోని (East Africa) జిబూటీ (Djibouti)తీరంలో ఘోర పడవ ప్రమాదం (Boat Accident) చోటుచేసుకుంది. సుమారు 305 మంది వలసదారులతో(Migrants) ప్రయాణిస్తున్న పడవ సముద్రంలో బోల్తా పడటంతో కనీసం 109 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 15 మంది చిన్నారులు (Children) ఉన్నట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) వెల్లడించింది.

ఈ ప్రమాదంలో పలువురు గల్లంతవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన జీవన పరిస్థితులు, ఉపాధి అవకాశాల కోసం ప్రమాదకర సముద్ర మార్గంలో ప్రయాణించిన వలసదారులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

ఈ ఘటన అక్టోబర్‌ 8–9 మధ్య రాత్రి జిబూటీలోని ఒబాక్‌ పట్టణానికి ఉత్తరాన గుహెరే (Guhere Area) ప్రాంతం సమీపంలో చోటుచేసుకుంది. జిబూటీ నుంచి యెమెన్‌కు వెళ్తున్న పడవ బాబ్‌-అల్‌-మందెబ్‌ (Bab-el-Mandeb Strait) జలసంధిని దాటే క్రమంలో సముద్రంలో బోల్తా పడినట్లు ప్రాణాలతో బయటపడిన వారు వెల్లడించారు. తొలుత 109 మంది మృతి చెందినట్లు ప్రకటించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 139కి పెరిగింది.

మరో 84 మంది గల్లంతైనట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదించాయి. 80 మందికి పైగా ప్రాణాలతో బయటపడగా, బాధితులకు స్థానిక అధికారులు, IOM సిబ్బంది వైద్య చికిత్సతో పాటు ఇతర అత్యవసర సహాయాన్ని అందిస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

‘హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికా’(Horn of Africa) ప్రాంతానికి చెందిన వేలాది మంది మెరుగైన జీవనోపాధి, భద్రత, ఉపాధి అవకాశాల కోసం జిబూటీ మీదుగా యెమెన్‌కు చేరుకుని, అక్కడి నుంచి గల్ఫ్‌ దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పేదరికం, అస్థిరత, వాతావరణ మార్పుల ప్రభావాలు ఈ ప్రమాదకర ప్రయాణాలకు కారణమవుతున్నాయని IOM పేర్కొంది.

యెమెన్‌లో(Yemen) కొనసాగుతున్న ఘర్షణలు, సముద్ర ప్రయాణాల్లో ఎదురయ్యే ప్రమాదాలు వలసదారుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ఈ విషాద ఘటన వలసదారుల కోసం సురక్షితమైన, చట్టబద్ధమైన ప్రయాణ మార్గాలను కల్పించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోందని అంతర్జాతీయ వలసల సంస్థ తెలిపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment