యద్దుల అయ్యప్పరెడ్డి మృతిపై టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా భావోద్వేగ పోస్టు(Emotional Post) పెట్టారు. యద్దుల అయ్యప్పరెడ్డికి తన కుటుంబానికి మధ్య ఉన్న అనుబంధాన్ని నాగార్జున గుర్తుచేసుకున్నారు.
“మా కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి యద్దుల అయ్యప్పరెడ్డి మృతిచెందడం నన్ను ఎంతో బాధించింది. ANRతో ఉన్న అనుబంధం నుంచి ఆయన మా ఫ్యామిలీ(Akkineni Family)కి మరింత దగ్గరయ్యారు. మా కుటుంబం మీద ఆయన చూపిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ మర్చిపోలేం అని నాగార్జున సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Deeply saddened by the passing of Yeddhula Ayyappa Reddy garu, he was ardent fan of my father, ANR garu and pillar of strength for the Akkineni family.
— Nagarjuna Akkineni (@iamnagarjuna) February 26, 2025
His love and affection to us can never be forgotten 🙏
My deepest condolences to his family, and may God give them the strength… pic.twitter.com/6i2k3ycNUt
కర్నూలు జిల్లాకు చెందిన యద్దుల అయ్యప్పరెడ్డి అక్కినేని నాగేశ్వరరావు వీరాభిమానిగా ఉండటమే కాదు, అక్కినేని కుటుంబానికి మిత్రుడిగా, భక్తుడిగా మారిపోయారు. ప్రతి శుభకార్యంలో, ప్రతి సినిమా విడుదల సందర్భంగా ఆయన సందడి తప్పనిసరి. అక్కినేని ఫ్యామిలీ పనుల్లో ఎల్లప్పుడూ అండగా ఉండేవారు. యద్దుల అయ్యప్పరెడ్డి మరణం అక్కినేని ఫ్యామిలీకి తీరని లోటు అని అక్కినేని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.








