కాంగ్రెస్ అధిష్టానం (Congress Leadership) తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) (TPCC)లో కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు కమిటీలను ఏర్పాటు చేస్తూ ఏఐసీసీ (AICC) ప్రకటన విడుదల చేసింది. ఈ కమిటీల్లో రాజకీయ వ్యవహారాల కమిటీ (22 మంది), సలహా కమిటీ (15 మంది), డీలిమిటేషన్ కమిటీ (7 మంది), సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ (16 మంది), క్రమశిక్షణా చర్యల కమిటీ (6 మంది) ఉన్నాయి. తెలంగాణలో మొదటిసారిగా సలహా కమిటీ (Advisory Committee)ని ఏర్పాటు చేయడం విశేషం.
రాజకీయ వ్యవహారాల కమిటీలో ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క తదితరులు సభ్యులుగా ఉన్నారు.
డీలిమిటేషన్ కమిటీకి (Delimitation Committee) చల్లా వంశీచంద్ రెడ్డి ఛైర్మన్‌గా, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఆది శ్రీనివాస్‌తో సహా ఏడుగురు సభ్యులు నియమితులయ్యారు. సంవిధాన్ బచావో కమిటీకి పి. వినయ్ కుమార్ నేతృత్వంలో అద్దంకి దయాకర్, బాలూ నాయక్‌తో పాటు 16 మంది సభ్యులున్నారు. క్రమశిక్షణా కమిటీకి మల్లు రవి ఛైర్మన్‌గా, ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు.
ఈ ఐదు కమిటీలతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శుల జాబితాను కూడా ప్రకటించాలని ఏఐసీసీ యోచిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
అయితే, కార్యవర్గం ప్రకటన లేకుండా ఈ కమిటీల ఏర్పాటుకే పరిమితం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళానికి దారితీసింది. రాజకీయ వ్యవహారాల కమిటీలో కొందరు కీలక నేతల పేర్లు లేకపోవడం, ముఖ్యంగా ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్, ఎంపీ అనిల్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వంటి వారికి చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే, 22 మంది సభ్యుల రాజకీయ వ్యవహారాల కమిటీలో ఎనిమిది మంది మంత్రులు ఉన్నప్పటికీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ వంటి మంత్రుల పేర్లు ప్రస్తావించలేదు. వీరు స్పెషల్ ఇన్వైటీలు









జనసేన ఎమ్మెల్యే నోటి దురుసు.. వైసీపీ ఎమ్మెల్సీ సవాల్