ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మంత్రి (Minister) అచ్చెన్నాయుడు (Achchennaidu) ఒత్తిళ్లు, వేధింపులకు గురైన ఏపీ ఆగ్రోస్ (AP Agros) జనరల్ మేనేజర్ (General Manager) (జి ఎం) రాజమోహన్ (Rajamohan) చివరికి సెలవు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న వార్త ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసి సెలవుపై వెళ్లిన ఆగ్రోస్ జీఎం రాజమోహన్ వ్యవహారం కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం చేయాలని జీఎం రాజమోహన్ పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అవినీతి వ్యవహారాల్లో సహకరించకపోవడంతో రాజమోహన్‌ను లక్ష్యంగా చేసుకున్న మంత్రి తన ఓఎస్డీ ద్వారా వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెప్పిన మాట విననందుకు బదిలీ ఆదేశాలు జారీ చేసి ఆయనను నెల్లూరుకు పంపించారని, దీంతో సెలవు పై వెళ్లడం తప్ప వేరే మార్గం లేదని రాజమోహన్ సీఎస్‌కు లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
ఇంతలో, రాజమోహన్ స్థానంలో అర్హత లేని జూనియర్ అధికారికి జీఎం బాధ్యతలకు నియమించడం పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు అధికారులను అవమానపరుస్తూ, మరోవైపు తనకు దగ్గరగా ఉన్నవారిని కీలక స్థానాల్లో కూర్చోబెడుతున్నారన్న ఆరోపణలు మంత్రి అచ్చెన్నాయుడిపై ముసురుకున్నాయి. ఈ వ్యవహారం త్వరలోనే రాజకీయ, పరిపాలనా వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.








