రోడ్డు ప్ర‌మాదం.. తీగల కృష్ణారెడ్డి మ‌న‌వ‌డు మృతి

రోడ్డు ప్ర‌మాదం.. తీగల కృష్ణారెడ్డి మ‌న‌వ‌డు మృతి

Summarize with AI

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్ర‌మాదంలో తీగ‌ల మనవడు దుర్మ‌ర‌ణం చెందారు. హైదరాబాద్ శివారులోని గొల్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్‌పై ముందుగా వెళ్తున్న లారీని కనిష్క్ ప్ర‌యాణిస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనిష్క్ రెడ్డి (19) తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందారు. కనిష్క్ రెడ్డి తల్లి తీగల సుసరిత హైదరాబాద్‌లోని మూసారాంబాగ్ కార్పొరేటర్‌గా సేవలు అందించారు. ఈ ఘటనతో తీగల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment