SouthAfrica Vs Australia : టాస్ ప‌డ‌కుండానే మ్యాచ్ రద్దు

టాస్ ప‌డ‌కుండానే దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు

Summarize with AI

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ChampionsTrophy)లో భాగంగా మంగళవారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ప్రారంభం కావాల్సిన దక్షిణాఫ్రికా – ఆస్ట్రేలియా (SouthAfrica Vs Australia) మ్యాచ్ టాస్ ప‌డ‌కుండానే ర‌ద్దు అయ్యింది. రావల్పిండి భారీ వ‌ర్షం (Rain) కార‌ణంగా మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లుగా అంపైర్లు ప్ర‌క‌టించారు. వ‌ర్షం త‌గ్గితే మ్యాచ్ 20 ఓవ‌ర్ల‌కు కుదించి నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని తొల‌త వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ, అది సాధ్య‌ప‌డ‌లేదు. స్టేడియం అంతటా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో, అంపైర్లు మ్యాచ్‌ను అధికారికంగా రద్దు చేశారు.

సెమీఫైనల్ బెర్త్‌పై ఉత్కంఠ
ఈ మ్యాచ్ రద్దవ్వడంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ ఫలితంతో గ్రూప్-బి నుంచి సెమీఫైనల్‌ బెర్త్‌పై పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. వచ్చే మ్యాచ్‌లలో గెలుపు సాధించే జట్లకే సెమీస్‌కు చేరే అవకాశాలు మెరుగుపడతాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment