రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లో కూడా తన ఎనర్జీతో అందరినీ అలరించే ప్రియాంకా చోప్రా.. తాజాగా మరోసారి తన డాన్స్‌తో వార్తల్లో నిలిచింది. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా- నీలం ఉపాధ్యాయల వివాహ వేడుకలో హిందీ సినీ అభిమానులను కట్టిపడేసే ‘మన్ మేరీ జాన్’ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది.
తన భర్త నిక్ జోనస్‌తో కలిసి స్టేజీపై డాన్స్ చేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ అద్భుతమైన డ్యాన్స్‌ను పెళ్లికి హాజరైన అతిథులు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు ప్రియాంకా ఎనర్జీ, గ్రేస్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.