తుపాన్ బాధితులను ఆదుకోవడంలోనూ రాజకీయమేనా?

తుపాన్ బాధితులను ఆదుకోవడంలోనూ రాజకీయమేనా?

Summarize with AI

‘అర్నాబ్’ తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో ప్రభుత్వం అందిస్తున్న అత్యవసర రేషన్ సాయం పంపిణీ తీరుపై కాకినాడ తీరప్రాంతాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ నగర పరిధిలోని సంజయ్ నగర్, దుమ్ములపేట, నూకలమ్మ మాన్యం వంటి తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో తుపాను బాధితులకు అందించే ఉచిత రేషన్ బియ్యం కోసం ఇచ్చిన కూపన్ల పంపిణీలో టీడీపీ నేత‌లు వివ‌క్ష చూపుతున్నార‌ని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రకృతి విపత్తు వల్ల ఇళ్లు జలమయమై, బియ్యం త‌డిసిపోయి తిన‌డానికి కూడా ఇబ్బందులు పడుతున్న వేళ సాయం అందించడంలో రాజకీయ వివ‌క్ష చూపించ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది.

ఆయా ప్రాంతాల్లోని బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పొందేందుకు రేషన్ డీలర్లు కూపన్లను తప్పనిసరి చేశారని స్థానికులు చెబుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు తమకు అనుకూలంగా ఉన్నవారికే ప్రాధాన్యమిస్తూ కూపన్లు ఇస్తున్నారని, నిజ‌మైన బాధితుల‌కు కూపన్లు అందలేదని పలువురు నిరుపేద బాధితులు ఆరోపిస్తున్నారు.

కూపన్లు లేవన్న నెపంతో బియ్యం ఇచ్చేందుకు డీలర్లు నిరాకరిస్తుండటంతో, వృద్ధులు, మహిళలు రోజంతా రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోందని కన్నీటి పర్యంతమవుతున్నారు. విపత్తు సమయాల్లో ఆకలితో అల్లాడుతున్నప్పుడు పార్టీలు, వర్గాల ప్రాతిపదికన సాయాన్ని వేరుచేయడం దారుణమని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment