“విలువల్లేని టీడీపీలో ఉండలేకే బయటకొచ్చాం!”

"విలువల్లేని టీడీపీలో ఉండలేకే బయటకొచ్చాం!"

Summarize with AI

అధికార కూటమి అరాచకాలు, అంతర్గత కుమ్ములాటలతో విసిగిపోయిన నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా శ్రీకాకుళం రాజకీయాల్లో పవర్ హౌస్‌గా పేరొందిన గుండ కుటుంబం టీడీపీతో ఉన్న 40 ఏళ్ల దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంది. శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తన ముఖ్య అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు.

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ సమక్షంలో గుండ లక్ష్మీదేవి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన అనంతరం గుండ లక్ష్మీదేవి విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ తీవ్రంగా దిగజారిపోయిందని, సిద్ధాంతాలు లేని పార్టీగా మారిందని తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు

“మేము తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 40 ఏళ్లుగా ఎంతో నిబద్ధతతో శ్రమించాం. నా భర్త (మాజీ మంత్రి దివంగత గుండ అప్పల సూర్యనారాయణ) 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా ప్రజలకు ఎంతో నిజాయితీగా సేవ చేశారు. కానీ నాడు ఎన్టీఆర్ కాలంలో ఉన్న విలువలు, సిద్ధాంతాలు, మంచి విధానాలు నేటి టీడీపీలో ఏకోశానా లేవు” అని మండిపడ్డారు.

“నా భర్త సేవలను గుర్తించకపోగా, ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనీయకుండా అడ్డుకుని తీవ్రంగా అవమానించారు. సొంత పార్టీలోనే నిరంతరం మానసిక వేధింపులకు గురిచేశారు. విలువలు పూర్తిగా కొరవడిన అటువంటి పార్టీలో మనశ్శాంతిగా ఉండలేకే వైయస్ఆర్సీపీలో చేరుతున్నాను” అని స్పష్టం చేశారు.

చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క మంచి కార్యక్రమం కూడా జరగడం లేదని విమర్శించారు. రైతులకు అవసరమైన సాయం అందడం లేదని, ఆస్పత్రుల్లో అత్యవసర మందులు కూడా దొరకడం లేదని, రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా వెనుకబడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతో పనిచేశామని, ఇప్పుడు వైయస్ఆర్సీపీలో కూడా అదే అంకితభావంతో పనిచేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తామని గుండ లక్ష్మీదేవి పునరుద్ఘాటించారు.

స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో శ్రీకాకుళంలో తిరుగులేని పట్టున్న గుండ కుటుంబం వైయస్ఆర్సీపీ గూటికి చేరడం అధికార కూటమికి, ముఖ్యంగా జిల్లా టీడీపీ నేతలకు కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీ వైయస్ జగన్ ప్రజానుకూల పోరాటాలకు ఆకర్షితులై సీనియర్ నేతలు ఫ్యాన్ కిందకు రావడం కూటమి పతనానికి స్పష్టమైన సంకేతమని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment