శతాబ్దన్నర క్రితం నాటి రాయలసీమ(Rayalaseema).. మద్రాస్ కరువుతో (Madras Famine) అల్లకల్లోలమవుతున్న కాలం.. పిడికెడు మెతుకుల కోసం ప్రజలు పడుతున్న అగచాట్లు ఒకవైపు, తెల్లదొరల(British Rulers) అకృత్యాలు.. మరోవైపు ఈ నరకాన్ని తెగనరికి సరికొత్త చరిత్ర రాయడానికి పుట్టుకొచ్చిన యోధుడే ‘సింగనమల రణబాలి'(Singanamala Ranabali)!
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న (Vijay Deverakonda-Rashmika Mandanna) కాంబినేషన్‌లో, రాహుల్ సాంకృత్యాన్ (Rahul Sankrityan) తెరకెక్కించిన ఈ పీరియాడిక్ యాక్షన్ విజువల్ వండర్ ‘రణబాలి'(Ranabali) ట్రైలర్ కట్ ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పూనకాలు తెప్పిస్తోంది. బలిష్టమైన ఫిజిక్, కళ్లల్లో రగులుతున్న క్రోధం, చేతిలో గొడ్డలి పట్టి బ్రిటిష్ పటాలాన్ని ఊచకోత కోస్తున్న విజయ్ దేవరకొండ అవతార్ ట్రైలర్‌కే హైలైట్. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్‌లలో విరుచుకుపడ్డాడు.
కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా.. కరువులో నలిగిపోతున్న జనాన్ని కాపాడుతూ, నిండు గర్భంతోనే విల్లంబులు పట్టి తెల్లదొరలపై ఎదురుతిరిగే ‘జయమ్మ’గా(Jayamma) రష్మిక మందన్న నటన ట్రైలర్‌లో ప్రాణప్రతిష్ఠ చేసింది. సర్ దియోడర్ హెక్టర్ (ఆర్నాల్డ్ వోస్లూ)(Arnold Vosloo) అణచివేతకు, రణబాలి తిరుగుబాటుకు నడుమ సాగే ప్రతిఘటనను ట్రైలర్‌లో అత్యంత రక్తాసిక్తంగా, రా అండ్ రస్టిక్‌గా చూపించారు.
గూస్‌బంప్స్ తెప్పించే మేకింగ్
అజయ్-అతుల్ (Ajay–Atul) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌కు ప్రాణం పోసింది. ప్రతి యాక్షన్ షాట్‌కు వచ్చే బీజీఎమ్ థియేటర్లలో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టడం ఖాయం. శతాబ్దన్నర కిందటి రాయలసీమ వాతావరణాన్ని, నాటి ఆవేదనను, వీరత్వాన్ని విజువల్స్‌గా మార్చడంలో దర్శకుడు వందకు వంద మార్కులు కొట్టేశారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ (Y. Ravi Shankar) ఏమాత్రం రాజీ పడకుండా హాలీవుడ్ స్థాయిలో ఈ పీరియడ్ విజువల్స్‌ను మలిచారు.
బాక్సాఫీస్ మోత ఖాయం
కరువు, కన్నీళ్లు, రక్తం, తిరుగుబాటు.. ఈ నాలుగింటి కలబోతగా వచ్చిన ‘రణబాలి’ ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేసింది. అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం టాలీవుడ్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.








