స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేయడం ముందే ఊహించిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. బీసీల పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని, కేవలం వారిని ఓటు బ్యాంకుగా వాడుకునేందుకే ఇలాంటి నాటకాలాడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కపట ప్రేమతో బీసీలను మోసం చేయాలని కుట్ర
హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఎవరిని అడిగినా ఈ జీవో హైకోర్టులో నిలబడదని ముందే చెప్పారని గుర్తుచేశారు. గతంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రయత్నమే చేసి భంగపడిందని, అదే విషయం ఆంధ్రప్రదేశ్‌లోనూ పునరావృతం అవుతుందని చంద్రబాబుకు స్పష్టంగా తెలుసన్నారు.
సీనియర్ నేత అయి ఉండి కూడా..
సుదీర్ఘ అనుభవమున్న సీనియర్ నాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇది హైకోర్టులో నిలబడదని పూర్తిగా తెలుసని, అయినప్పటికీ బీసీలను మభ్యపెట్టడానికే ఈ జీవోలు ఇచ్చారని ఆరోపించారు. నిజంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే, రాజ్యాంగ సవరణ ద్వారా పటిష్టమైన విధానాన్ని అమలు చేస్తున్న తమిళనాడు రాష్ట్రాన్ని ఎందుకు ఫాలో కారూ అని సూటిగా ప్రశ్నించారు.
కోర్టులపై నెపం నెట్టడం సరికాదు
కోర్టు తీర్పులు ఎలా ఉంటాయో ముందే తెలిసి కూడా 34% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించడం, ఆ తర్వాత కోర్టు కొట్టివేయగానే “మేము ఇవ్వాలనుకున్నాము, కోర్టు కొట్టేసింది” అంటూ న్యాయస్థానాలపై నెపం నెట్టడం ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిదర్శనమని రామకృష్ణ ధ్వజమెత్తారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని, బీసీల పట్ల చూపుతున్న ఈ కపటప్రేమను వెంటనే మానకోవాలని ఆయన హితవు పలికారు.
బీసీ రిజర్వేషన్ల తీర్పు ఊహించిందే..
— Telugu Feed (@Telugufeedsite) October 1, 2026
ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. ఎవ్వర్ని అడిగినా ఇదే చెప్తారు
బీసీలను మభ్యపెట్టాలా, ఓటు బ్యాంకుగా వాడుకోవాలనే ఆలోచనతో జీవోల పేరుతో నాటకాలు
ఇటీవల తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఇదే చేశారు.. కోర్టు కొట్టేసింది
అది… pic.twitter.com/QCaIIk1QDU








