వైఎస్‌ ఫొటో పెట్టుకున్నార‌ని.. వృద్ధ దంపతులపై అరాచ‌కం

వైఎస్‌ ఫొటో పెట్టుకున్నార‌ని.. వృద్ధ దంపతులపై అరాచ‌కం

Summarize with AI

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి (YS Rajasekhara Reddy) ఫొటో(Photo) పెట్టుకుని ఆరాధించడమే ఆ వృద్ధ దంపతులు చేసిన నేరమా..? ఆరోగ్యశ్రీ (Aarogyasri) ద్వారా ప్రాణాలు నిలిచిన నేతపై కృతజ్ఞత చూపడమే తప్పైందా..? విజయనగరం (Vizianagaram) జిల్లా రేగిడి మండలం మజ్జిరాముడుపేటలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 20 ఏళ్లుగా చిన్న బడ్డీకొట్టు (Small Shop) నడుపుకుంటూ జీవిస్తున్న వృద్ధ దంపతుల జీవనాధారమైన షెడ్డును కొందరు టీడీపీ(TDP) నేతలు ధ్వంసం చేసిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది

మజ్జిరాముడుపేట గ్రామానికి చెందిన మంకు గణపతిరావు(Manku Ganapathi Rao), గౌరీశ్వరమ్మ (Gowrishwaramma) దంపతులు గత 20 ఏళ్లుగా చిన్న బడ్డీకొట్టు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలం క్రితం గణపతిరావు తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. అప్పటి ప్రభుత్వం అమలు చేసిన ఆరోగ్యశ్రీ (Aarogyasri) పథకం ద్వారా గణపతిరావుకు ఉచితంగా గుండె ఆపరేషన్ (Heart Surgery) జరిగింది. దీంతో ఆయన ప్రాణాలు దక్కాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ కృతజ్ఞతతో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను తమ బడ్డీకొట్టులో పెట్టుకుని పూజిస్తున్నాడు.

అయితే వైఎస్సార్ ఫొటో పెట్టుకోవడాన్ని స్థానిక టీడీపీ నేతలు వ్యతిరేకించారని, రాజకీయ కక్షతో తమ జీవనాధారమైన షెడ్డును కూల్చివేశారని గణపతిరావు దంపతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. స్థానిక టీడీపీ(TDP) నేతలు టంకాల హేమచంద్ర(Tankala Hemachandra), టంకాల చంద్రమౌళి (Tankala Chandramouli) తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. రేకుల షెడ్డును ధ్వంసం చేయడంతో పాటు అందులోని సామగ్రి కూడా పాడైందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.

గణపతిరావు దంపతుల కుమారుడు ఆర్మీలో(Indian Army) పనిచేస్తూ దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దేశ రక్షణ కోసం కుమారుడు సరిహద్దుల్లో సేవలందిస్తుంటే.. స్వగ్రామంలో తమ వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ లేకుండా పోయిందని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ జీవనాధారాన్ని ధ్వంసం చేయడంతో కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను ఆశ్రయించినప్పటికీ తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

వైఎస్సార్ ఫొటో పెట్టుకున్నందుకే వృద్ధ దంపతుల జీవనాధారాన్ని ధ్వంసం చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి వృద్ధ దంపతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment