జానీ మాస్టర్ భార్య తీరుపై ఫిల్మ్ ఫెడరేషన్ ఆగ్రహం

జానీ మాస్టర్ భార్య తీరుపై ఫిల్మ్ ఫెడరేషన్ ఆగ్రహం

Summarize with AI

తెలుగు సినీ పరిశ్రమలో డాన్సర్స్ అసోసియేషన్‌ (Dancers Association) వ్యవహారం మరోసారి వివాదానికి దారితీసింది. డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) భార్య(Wife) సుమలత (Sumalatha) తీరుపై ఫిల్మ్ ఫెడరేషన్ (Film Federation) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఫెడరేషన్ అత్యవసర సమావేశం (Emergency Meeting) నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఫిల్మ్ ఫెడరేషన్ నిర్వహించిన అత్యవసర సమావేశానికి 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులు హాజరయ్యారు. ఇటీవల డాన్సర్స్ అసోసియేషన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, కార్యవర్గం వ్యవహరిస్తున్న తీరుపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని (Anil Vallabhaneni) తెలిపారు.

డాన్సర్స్ అసోసియేషన్ ప్రస్తుత కార్యవర్గం ఫెడరేషన్ నిర్ణయాలను లెక్కచేయకుండా వ్యవహరిస్తోందని సమావేశంలో సభ్యులు అభిప్రాయపడినట్లు ఆయన వెల్లడించారు. డాన్సర్స్ అసోసియేషన్ ప్రస్తుత కార్యవర్గానికి ఫెడరేషన్ (Federation) నుంచి ఎలాంటి సహకారం ఉండదని అనిల్ వల్లభనేని స్పష్టం చేశారు. డాన్సర్స్ అసోసియేషన్ మినహా మిగిలిన 24 క్రాఫ్ట్స్‌కు ఫెడరేషన్ పూర్తి మద్దతు కొనసాగుతుందని తెలిపారు.

ఫెడరేషన్ నిర్ణయాలను (Federation Decisions) వ్యతిరేకించిన డాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకు కూడా తమ సహకారం ఉండదని సమావేశంలో సభ్యులు అభిప్రాయపడినట్లు చెప్పారు. అయితే యూనియన్‌కు చెందిన సాధారణ డాన్సర్లకు వ్యక్తిగతంగా ఏదైనా సహాయం అవసరమైతే ఫెడరేషన్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వివాదాన్ని యూనియన్‌లోని సాధారణ సభ్యులకు ఆపాదించడం తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు.

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై(Jani Master) గతంలో విధించిన సస్పెన్షన్ (Suspension) కొనసాగుతుందని ఫెడరేషన్ అధ్యక్షుడు వెల్లడించారు. గతంలో ఫెడరేషన్ వద్దకు వచ్చిన రూ.3 లక్షల మొత్తాన్ని జానీ మాస్టర్‌కు తిరిగి పంపిస్తున్నట్లు తెలిపారు.

డాన్సర్స్ అసోసియేషన్‌లో ఇటీవల నిర్వహించిన ఉపఎన్నికల (By-Elections) వ్యవహారంపైనా ఫెడరేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో ఫెడరేషన్ సమావేశంలో సినీ పెద్దలు, చిరంజీవి (Chiranjeevi) సూచనల మేరకు సుమలత అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తారని చెప్పినప్పటికీ.. ఆ తర్వాత ఏకపక్షంగా ఉపఎన్నికలు నిర్వహించారని అనిల్ వల్లభనేని ఆరోపించారు.

ఫెడరేషన్‌ను సంప్రదించకుండా, దాని నిర్ణయాలను పట్టించుకోకుండా డాన్సర్స్ అసోసియేషన్ వ్యవహరించడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ (Telugu Film Federation) దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న సంస్థల్లో ఒకటని అనిల్ వల్లభనేని పేర్కొన్నారు. పరిశ్రమలోని అన్ని క్రాఫ్ట్స్ మధ్య సమన్వయం, ఐక్యత ఉండాలన్నదే ఫెడరేషన్ ఉద్దేశమని తెలిపారు.

డాన్సర్స్ అసోసియేషన్ ప్రస్తుత కార్యవర్గంతో సంస్థాగతంగా సహాయ నిరాకరణ కొనసాగించినప్పటికీ.. ఫెడరేషన్‌కు అనుబంధంగా ఉన్న ఇతర క్రాఫ్ట్స్‌కు పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. డాన్సర్స్ అసోసియేషన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఫిల్మ్ ఫెడరేషన్ తీసుకున్న తాజా నిర్ణయాలతో సినీ పరిశ్రమలో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment