‘ఇది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు.. పచ్చ కాంగ్రెస్‌’

‘ఇది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు.. పచ్చ కాంగ్రెస్‌’: కొండా సురేఖ కుమార్తె

Summarize with AI

పరకాల నియోజకవర్గ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తనకు అనుకూలంగా సర్వేలు ఉన్నాయని, నియోజకవర్గంలో కొందరు గందరగోళానికి తెరలేపినందుకే సీఎం రేవంత్‌రెడ్డి తన పేరును ప్రకటించారని అన్నారు.

పరకాలలో నిర్వహించిన సభకు మంత్రి కొండా సురేఖను కూడా ఆహ్వానించానని, ఆమె ఎందుకు రాలేదో తనకు తెలియదని చెప్పారు. కొండా సుస్మిత వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, కాంగ్రెస్‌లో ‘పచ్చ కాంగ్రెస్‌’, ‘తెల్ల కాంగ్రెస్‌’ అంటూ ఏమీ లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని రేవూరి పేర్కొన్నారు.

మరోవైపు రేవూరి వ్యాఖ్యలకు కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తీవ్ర స్థాయిలో స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. ఆయనకు కళ్లు నెత్తికెక్కాయని విమర్శించారు. టీడీపీ సభ్యులంటే రేవంత్‌రెడ్డికి ఎందుకంత ప్రేమ అంటూ ప్రశ్నించారు. ‘డైపర్ వేసుకునే రేవూరికి టికెట్ ఎలా ఇస్తారు?’ అంటూ రేవూరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకునే హక్కు రేవంత్‌రెడ్డికి లేదని అన్నారు. ఇది ఒరిజినల్ కాంగ్రెస్ కాదని, ‘పచ్చ కాంగ్రెస్’ అంటూ విమర్శించారు. రేవూరి, సుస్మిత వ్యాఖ్యలతో పరకాల కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి బహిర్గతం కావడంతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment