ఏపీ హోంమంత్రి ఇలాకాలో మట్టి దోపిడీ?

ఏపీ హోంమంత్రి ఇలాకాలో మట్టి దోపిడీ?

Summarize with AI

నిజాయితీ, చిత్తశుద్ధి గురించి ప్రతి వేదికపై ప్రస్తావించే సాక్షాత్తూ ఏపీ హోంమంత్రి (AP Home Minister) నియోజ‌క‌వ‌ర్గంలో(Constituency) విలువ‌ల‌కు తిలోదకాలిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha)ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో మ‌ట్టి దోపిడీ (Soil Mining) వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పోలవరం కుడి కాలువలో (Polavaram Right Canal) రాత్రిపగలు తేడా లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పోల‌వ‌రం కాలువలో తవ్విన మట్టిని పెద్ద సంఖ్యలో లారీల్లో(Lorries) తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రోజుకు వేల టన్నుల మట్టిని తరలించి, సమీపంలోని ఓ ప్రైవేట్ లేఅవుట్‌ ప్రాంతానికి తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తవ్వకాలు సుమారు నెల రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్నాయని స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్రభుత్వ పరిధిలోని(Government Jurisdiction) కాలువ ప్రాంతం నుంచి మట్టిని తవ్వి ప్రైవేట్‌ అవసరాలకు తరలించడం వెనుక ఎవరున్నారనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మ‌ట్టి దోపిడీపై (Illegal Soil Mining) స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వెంపాడు టోల్‌గేట్‌ (Vempadu Toll Gate) వద్ద పోలీసులు ఏడు లారీలను పట్టుకున్నట్లు ప‌ట్టుకోగా, వాటిలో మూడు లారీలపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

అయితే మిగిలిన లారీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎన్ని టన్నుల మట్టిని తరలించేందుకు అనుమతి ఉంది? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వస్తున్నాయి. అక్రమ మట్టి తవ్వకాలపై స్థానికులు జిల్లా కలెక్టర్‌కు (District Collector) కూడా ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షాత్తూ హోంమంత్రి నియోజ‌క‌వ‌ర్గంలో ప్రభుత్వానికి చెందిన కాలువలో మట్టి తవ్వకాలకు ఎవరు అనుమతులు ఇచ్చారు? తవ్విన మట్టిని ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? లారీల ద్వారా జరుగుతున్న రవాణాకు(Transportation) సంబంధించిన రికార్డులు ఏమిటి? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

పోలవరం కుడి కాలువలో జరుగుతున్న మట్టి తవ్వకాలపై రెవెన్యూ(Revenue), ఇరిగేషన్‌(Irrigation), మైనింగ్‌(Mining), పోలీసు శాఖలు (Police Departments)సంయుక్తంగా విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఈ స్థాయిలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావడం రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల అధికారిక వివరణ రావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment