గ్రామం మొత్తం క్రాప్ హాలిడే.. కోనసీమ రైతుల కీలక నిర్ణయం

గ్రామం మొత్తం క్రాప్ హాలిడే.. కోనసీమ రైతుల కీలక నిర్ణయం

Summarize with AI

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని (Dr. B.R. Ambedkar Konaseema District)  అల్లవరం మండలం తాడికోన గ్రామ రైతులు (Tadikona Village Farmers) ఈ ఖరీఫ్ సీజన్‌లో(Kharif Season) ‘క్రాప్ హాలిడే'(Crop Holiday) ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో సుమారు 250 ఎకరాల్లో వరి సాగు చేయబోమని తేగేసి చెప్పేశారు. సాగునీటి సమస్యలు (Irrigation Water Problems), కాలుష్యంపై (Pollution) ఎన్నిసార్లు అధికారులకు వినతులు ఇచ్చినా పరిష్కారం లభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైతులు తెలిపారు.

రైతుల ఆరోపణల ప్రకారం.. సమీపంలోని ఆక్వా చెరువుల (Aqua Ponds) నుంచి విడుదలవుతున్న కలుషిత నీరు వ్యవసాయ పొలాల్లోకి చేరి పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. అలాగే డ్రైనేజీ వ్యర్థాలు కూడా పంటకాలువల్లోకి చేరడంతో భూమి సారం తగ్గిపోతుందని, దిగుబడులు పడిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యలపై అల్లవరం మండలం తాడికోన గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్‌కు (R. Mahesh Kumar) వినతిపత్రం అందజేశారు. గత 20 ఏళ్లుగా ఇదే సమస్య ఎదురవుతోందని, అయినప్పటికీ శాశ్వత పరిష్కారం చూపలేదని పేర్కొన్నారు.

పంటకాలువలను వెంటనే శుభ్రపరచడంతో పాటు డ్రైనేజీ, ఆక్వా వ్యర్థాలు కాలువల్లోకి చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు(Farmers) డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు వరి సాగు చేయబోమని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, గ్రామంలోని వ్యవసాయ భూముల పరిస్థితిని రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) (RDO) పరిశీలించారు. రైతుల సమస్యలపై నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపనున్నట్లు సమాచారం. రైతుల డిమాండ్లపై జిల్లా యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment