ప‌నిమీద పంజాబ్ వెళ్లినా ఏపీలో కేసు..?

ప‌నిమీద పంజాబ్ వెళ్లినా ఏపీలో కేసు..?

Summarize with AI

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) శ్రీ‌కాకుళం ప‌ర్య‌ట‌న (Srikakulam Tour) సంద‌ర్భంగా ఆముదాల‌వ‌ల‌స వైసీపీ (YSRCP) ఇన్‌చార్జ్ చింతాడ ర‌వికుమార్‌పై (Chintada Ravikumar) కూట‌మి ప్ర‌భుత్వం (Coalition Government) కేసు న‌మోదు చేసింది. మ‌హిళా ఎస్ఐని ఇబ్బందులకు గురిచేశారని టీడీపీ మీడియాలో (TDP Media) ప్ర‌సారాలు న‌డిచిన మ‌రుస‌టి రోజు ( జూలై 31న‌) 21 మందిపై ఎఫ్ఐఆర్ న‌మోదైంది. అయితే రాజ‌కీయ క‌క్ష‌సాధింపులో భాగంగానే కేసు న‌మోదు చేశార‌ని వైసీపీ ఆరోపిస్తున్న‌ట్లుగా.. సంచ‌ల‌నాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

వైఎస్ జగన్‌ శ్రీకాకుళం పర్యటన సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు అసలు ఘటనా స్థలంలోనే లేని అమాయకులపై, వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులపై (Private Employees) తప్పుడు కేసులు బనాయించినట్లు ఆధారాలతో వైసీపీ బ‌హిర్గతం చేసింది. వైసీపీ శ్రేణులతో పాటు నిరపరాధులను ఈ కేసులో నిందితులుగా ఇరికించిన తీరుపై బాధితులు తమ వద్ద ఉన్న స్పష్టమైన ఆధారాలను బయటపెట్టారు.

  • పంజాబ్‌లో ఉన్న వ్య‌క్తిపై
  • ఈ కేసులో గరుగుబిల్లి తేజేశ్వర్రావు (Garugubilli Tejeswara Rao) (A-9) ప్రైవేటు ఉద్యోగి. తేజేశ్వర్రావు జూలై 28న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో (AP Express) తన కుమార్తెను పంజాబ్‌లోని యూనివర్సిటీలో (Punjab University) చేర్పించేందుకు బయల్దేరి, జూలై 30న ఢిల్లీకి చేరుకున్నారు. కుమార్తె అడ్మిష‌న్ కోసం తేజేశ్వ‌ర్రావు పంజాబ్ వెళ్లాడు.
  • ఘటనా స్థలానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయనను ఈ కేసులో A-9 నిందితుడిగా చేర్చారు. తాను రైలు ప్రయాణంలో ఉన్నట్లు ట్రైన్ టికెట్లు, కుమార్తెతో క‌లిసి తేజేశ్వర్రావు హాస్ట‌ల్ మెస్‌లో టిఫిన్ చేస్తున్న‌ ఫొటోలను వైసీపీ విడుదల చేసింది.
  • కోర్టు విధుల్లో ఉన్న లాయ‌ర్‌పై
  • ఈ కేసులో ఏ8 గా ఉన్న ఆముదాలవలసకు చెందిన న్యాయవాది దానేటి రామ్మోహన్‌రావు (Daneti Ramamohana Rao) ఘటన జరిగిన సమయానికి ఆముదాలవలస కోర్టులో తన వృత్తిపరమైన విధుల్లో ఉన్నారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న పాల్గొన‌లేద‌ని ఆయ‌నే స్వ‌యంగా చెబుతున్నారని వైసీపీ పేర్కొంది. ప‌రిశీల‌న‌ లేకుండానే.. కోర్టులో ఉన్న త‌న‌ను A-8గా చేర్చ‌డంపై ఆయ‌నే షాక్ అయ్యాడట.
  • నిరసనలో పాల్గొన్న వ్య‌క్తిపై..
  • డాక్యుమెంటర్‌గా పనిచేస్తున్న నానుపాత్రును సురేష్ (Nanupatruni Suresh) సబ్‌రిజిస్ట్రార్ వ్యవస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆరోజంతా సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఘటనతో ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయనపై కూడా కేసు మోపి A-11గా పేరు చేర్చడం చర్చనీయాంశంగా మారింది.

రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబు సర్కార్ సామాన్య వ్యాపారవేత్తలు, రైతులు, ప్రైవేటు ఉద్యోగులు, న్యాయవాదులపై కల్పిత కేసులు బనాయిస్తోందని స్థానికులు, వైసీపీ మండిపడుతోంది. “కనీస విచారణ లేకుండా, ఘటనా స్థలంలో ఉన్నారా లేదా అని కూడా సరిచూసుకోకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు నమోదు చేయడం ఘోరం. ఆధారాలతో సహా ప్రభుత్వ కుట్రలను ప్రజల ముందు ఉంచుతాం” అని వైసీపీ చేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment