బ్రహ్మముహూర్తంలో ‘రామాయణం’ ట్రైలర్ రిలీజ్

బ్రహ్మముహూర్తంలో రిలీజైన ‘రామాయణం’ ట్రైలర్..

Summarize with AI

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’ ట్రైలర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చి అంచనాలను అమాంతం పెంచేసింది. గురువారం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం సందర్భంగా ఉదయం 4:15 గంటలకు విడుదలైన ఈ ట్రైలర్, విడుదలైన క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. మూడు గంటల్లోనే 1.3 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది.

విజువల్స్, గ్రాఫిక్స్, భారీ నిర్మాణ విలువలు, పురాణ గాథను తెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా రావణుడిగా యశ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, శ్రీరాముడిగా రణబీర్ కపూర్ ప్రశాంతమైన లుక్, సీతాదేవిగా సాయి పల్లవి చూపించిన సాత్వికత ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పటివరకు నటీనటుల ఎంపికపై వచ్చిన విమర్శలకు ఈ ఒక్క ట్రైలర్‌తోనే మేకర్స్ గట్టి సమాధానం ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, అంతర్జాతీయ సంగీత దిగ్గజాలు ఏఆర్ రెహమాన్–హన్స్ జిమ్మెర్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు ప్రాణం పోసింది. ప్రతి ఫ్రేమ్‌లో విజువల్ గ్రాండియర్ కనిపిస్తుండగా, లక్ష్మణుడిగా రవి దూబే, కైకేయిగా లారా దత్తా, హనుమంతుడిగా సన్నీ డియోల్‌తో పాటు ఇతర కీలక పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి.

గతంలో టీజర్‌పై వ్యక్తమైన విమర్శలను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు నితేష్ తివారీ ప్రతి అంశాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ స్పష్టంగా తెలియజేసింది. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ప్రపంచ స్థాయిలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఆవిష్కరించాలనే నిర్మాత నమిత్ మల్హోత్రా విజన్‌కు ఈ ట్రైలర్ నిదర్శనంగా నిలిచింది. దీంతో ఈ సినిమా కేవలం మరో పాన్-ఇండియా చిత్రం కాకుండా, భారతీయ సినిమా వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే విజువల్ ఎపిక్‌గా నిలుస్తుందనే అంచనాలు రోజురోజుకూ మరింత బలపడుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment