ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు బూమ్రా దూరం? కారణం ఇదే..

ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు బూమ్రా దూరం? కారణం ఇదే..

Summarize with AI

టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా త్వరలో ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే మ్యాచ్‌లు, టీ20 సిరీస్‌లకు దూరంగా ఉండనున్నారు. బీసీసీఐ అతనికి ఈ సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించిందని సమాచారం. త్వరలో భారత పర్యటనకు ఇంగ్లాండ్ జట్టు రాబోతుంది. ఈ పర్యటనలో భాగంగా భార‌త్‌తో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడ‌నుంది ఇంగ్లాండ్‌.

ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రాధాన్యత
ఇంగ్లాండ్ పర్యటన తర్వాత ఫిబ్రవరిలో ప్రారంభమవనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని బూమ్రాను ఫిట్‌గా ఉంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతని కీలక పాత్రను భవిష్యత్తు టోర్నమెంట్‌లలో ఉపయోగించేందుకు బీసీసీఐ ఈ చర్య తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే, బుమ్రా అందుబాటులో లేని నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ విభాగంలో మార్పులు కనిపించే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment