హృతిక్ రూ.400 కోట్ల భరణం.. వైరల్ వార్తపై సుసాన్ కుటుంబం క్లారిటీ..

హృతిక్ రూ.400 కోట్ల భరణం.. వైరల్ వార్తపై సుసాన్ కుటుంబం క్లారిటీ..

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), మాజీ భార్య సుసాన్ ఖాన్ (Sussanne Khan) విడాకుల (Divorce) సమయంలో రూ.400 కోట్ల భరణం (Alimony) తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఎన్నేళ్లుగా వైరల్ అవుతున్న వార్తలపై తాజాగా షాకింగ్ క్లారిటీ వచ్చింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని సుసాన్ ఖాన్ సోదరి ఫరా అలీ ఖాన్ (Farah Ali Khan) స్పష్టం చేశారు. సుసాన్ హృతిక్ నుంచి ఎలాంటి భరణం తీసుకోలేదని, రూ.400 కోట్ల అలిమనీ అంటూ ప్రచారం చేస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని ఆమె వెల్లడించారు. వాస్తవాలకు ఆధారాలు లేకుండా ఇలాంటి పుకార్లను నమ్మొద్దని సోషల్ మీడియా వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.

హృతిక్ రోషన్(Hrithik Roshan, సుసాన్ ఖాన్ (Sussanne Khan) 2014లో విడాకులు తీసుకున్నప్పటికీ తమ ఇద్దరు కుమారుల పెంపకంలో ఇప్పటికీ కలిసి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డబ్బు కంటే కుటుంబ బంధాలకు, పరస్పర గౌరవానికే సుసాన్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ఫరా అలీ ఖాన్ తెలిపారు. ప్రస్తుతం హృతిక్ నటి సబా ఆజాద్‌తో, సుసాన్ నటుడు అర్స్లాన్ గోనితో రిలేషన్‌లో ఉన్నప్పటికీ, తమ పిల్లల భవిష్యత్తు విషయంలో ఇద్దరూ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఫరా చేసిన తాజా వ్యాఖ్యలతో హృతిక్ రూ.400 కోట్ల భరణం చెల్లించారనే ప్రచారానికి మరోసారి పూర్తి స్థాయిలో చెక్ పడింది.

Join WhatsApp

Join Now

Leave a Comment