‘ప్రశ్న రావణ్’కు బెయిల్.. వెంటనే మరో కేసు (Video)

‘ప్రశ్న రావణ్’కు బెయిల్.. వెంటనే మరో కేసు (Video)

ఏపీ(Andhra Pradesh) రాజకీయాల్లో సోషల్ మీడియా అరెస్టుల పర్వం తీవ్ర దుమారం రేపుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై గత రాత్రి హైద‌రాబాద్‌లో (Hyderabad) పిఠాపురం పోలీసులు (Pithapuram Police) అదుపులోకి తీసుకున్న ప్రముఖ యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’కు (Prashna Ravana) స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్(Bail) మంజూరు చేసింది. అయితే, బెయిల్ వచ్చి విడుదలైన కొద్దిసేపటికే సర్పవరం పోలీసులు ఆయనను మరో కేసులో తిరిగి అదుపులోకి తీసుకోవడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కూటమి ప్రభుత్వం(Coalition Government), పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన(Jana Sena) కార్యకర్త బొజ్జా కుమార్ (Bojja Kumar) ఇచ్చిన ఫిర్యాదుతో పిఠాపురం పోలీసులు ప్రశ్న రావణ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని బుధవారం మెజిస్ట్రేట్ (Magistrate) ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా రావణ్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.

సోషల్ మీడియా కేసుల్లో ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్ట్(Arrest) చేయడం చట్టవిరుద్ధమని న్యాయవాది వాదించారు. దీనితో ఏకీభవించిన మెజిస్ట్రేట్, వ్యక్తిగత పూచీకత్తుపై ప్రశ్న రావణ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

విడుదలైన వెంటనే రీ-అరెస్ట్
కోర్టులో న్యాయం గెలిచి ప్రశ్న రావణ్ బయటకు రాగానే, అక్కడ అప్పటికే కాపుగాసి ఉన్న సర్పవరం పోలీసులు రంగంలోకి దిగారు. 2025లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి జనసేన కార్యకర్తలు ఇచ్చిన పాత ఫిర్యాదును ఆధారంగా చూపుతూ ఆయనను మళ్లీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ పరిణామాలపై ప్రశ్న రావణ్ తరపు న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ (Jai Bhim Bharat Party) అధినేత జడ శ్రవణ్ కుమార్ (Jada Sravan Kumar) మీడియా సమక్షంలో కూటమి ప్రభుత్వంపై, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది పూర్తిగా ప్రభుత్వ కక్షసాధింపు చర్య అని ధ్వజమెత్తారు. “ఒక కేసులో కోర్టు బెయిల్ ఇచ్చిన నిమిషాల్లోనే మరో పాత కేసు పేరుతో అదుపులోకి తీసుకోవడం రాజ్యాంగబద్ధం కాదు, న్యాయబద్ధం అంతకన్నా కాదు. ఇది పౌరుల ప్రాథమిక హక్కులను పూర్తిగా హరించడమే” అని జ‌డ శ్ర‌వ‌ణ్ ఆరోపించారు.

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) నాపై బాడీ షేమింగ్ చేస్తూ, అహేళనగా మాట్లాడితే దానికి చట్టాలు వర్తించవా? ఆయనపై కేసులు ఉండవా?, ‘కాళ్లకు కాళ్ళు.. కీళ్ళకు కీళ్ళు విరగొడతాం’ అని, వైసీపీ ఎమ్మెల్యేలను బూతులు తిడుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడితే అది రాజ్యాంగబద్ధమా?, జనసేన నేత పంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రిని దుర్భాషలాడితే అది న్యాయబద్ధమా? వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదు? అని జ‌డ శ్ర‌వ‌ణ్ ప్ర‌శ్నించారు.

“టైమ్ మీది కాబట్టి ఇప్పుడు కొడుతున్నారు.. మా టైమ్ కూడా వస్తుంది. మేము కొడితే ఈ ప్రభుత్వానికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. ఇలాంటి అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు” అని జడ శ్రవణ్ హెచ్చరించారు. ప్రశ్న రావణ్‌కు ఏం జరిగినా దానికి కూటమి ప్రభుత్వం మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment