హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఏపీ పోలీసుల హైడ్రామా (Video)

హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఏపీ పోలీసుల హైడ్రామా (Video)

విజ‌య‌వాడ సాయ‌కృష్ణ‌(Sayakrishna), క‌ర్నూలు గంగ‌మ్మ(Gangamma) లాక‌ప్‌డెత్‌ల (Lockup Death) కేసు కార‌ణంగా ఏపీ పోలీసుల (AP Police) తీరుపై దేశ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నా.. ఏపీలో ఖాకీల తీరు మ‌రోసారి వివాదాస్ప‌దంగా మారింది. సివిల్ డ్రెస్‌లో (Civil Dress) వ‌చ్చిన కొంద‌రు వ్య‌క్తి ఏపీ పోలీసులం(AP Police) అని చెప్పి హైద‌రాబాద్‌లో (Hyderabad) అర్ధ‌రాత్రి హైడ్రామా సృష్టించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

తెలంగాణ (Telangana) సీనియర్ జర్నలిస్ట్ (Journalist) కే. వెంకటరామిరెడ్డి (కేవీ రెడ్డి)ని (K. Venkatarami Reddy) ఏపీ పోలీసులు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకోవ‌డం వివాదాస్ప‌దంగా మారింది. విజయనగరం జిల్లా పోలీసులు మంగళవారం అర్ధరాత్రి మఫ్టీలో వచ్చి ఆయనను అరెస్ట్ చేయడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అరెస్ట్ సమయంలో కేవీ రెడ్డి నివాసముంటున్న ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

సివిల్ డ్రస్‌లో వచ్చిన ఏపీ పోలీసులు.. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే కేవీ రెడ్డిని (KV Reddy) తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిని గమనించిన ఆయన భార్య, చిన్న పిల్లలు అడ్డుకుంటూ.. “ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. కేవీ రెడ్డి భార్య కన్నీరు పెట్టుకుంటూ, బ్రతిమిలాడినా పోలీసులు ఏమాత్రం కనికరించలేదు. పైగా ఆమెను పక్కకు నెట్టేసి, బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ దౌర్జన్యపూరిత వాతావరణం నెలకొంది.

చిన్న పిల్లల (Children) ముందే పోలీసులు ప్రవర్తించిన తీరుపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారెంట్ (Warrant) ఉందని చెబుతూ ప్రైవేట్ వాహనంలో కేవీ రెడ్డిని బలవంతంగా తరలించారు.

విజయనగరం జిల్లా బాడంగి లేదా బొబ్బిలి పోలీసులు ఆయనను తీసుకెళ్లారని సరూర్ నగర్ పోలీసులు చెబుతున్నప్పటికీ, అసలు ఏ కేసులో.. ఏ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారనే దానిపై స్పష్టత లేకపోవడంతో కేవీ రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్ట్ ఉదంతం తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) పెను తుఫాను సృష్టించింది. ఈ ఘటనపై టీఆర్ఎస్(TRS) అధ్య‌క్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “మన గడ్డపై ఒక తెలంగాణ జర్నలిస్ట్‌ను ఏపీ పోలీసులు లాక్కెళ్తుంటే, ఇక్కడి పోలీసులు వారికి సహకరించడం అత్యంత దుర్మార్గం. కళ్లెదుటే భార్యాపిల్లలు ఏడుస్తున్నా పట్టించుకోకుండా, ఏపీ పోలీసులకు మన ఖాకీలు వత్తాసు పలకడం సిగ్గుచేటు” అని కవిత ధ్వజమెత్తారు.

గతంలోనూ కేవీ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై, ఈవీఎంలపై, ప్రజా వ్యతిరేక విధానాలపై డిజిటల్ మీడియా వేదికగా నిలదీస్తున్నందుకే కక్షగట్టి ఇలాంటి తప్పుడు కేసులు బనాయిస్తూ, భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అర్ధరాత్రి పూట ఒక జర్నలిస్ట్ కుటుంబంపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment