గెటప్ మార్చేసిన టీఎంసీ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్!

గెటప్ మార్చేసిన టీఎంసీ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్!

Summarize with AI

పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్‌కు(TNC) చెందిన ఎంపీ(MP)సయానీ ఘోష్ (Sayani Ghosh) అకస్మాత్తుగా పూర్తిగా గెటప్ (Getup) మార్చుకుని కోల్‌కతా ఎయిర్‌పోర్టులో (Kolkata Airport) కనిపించడం చర్చనీయాంశంగా మారింది. టోపీ, మాస్క్, కళ్లద్దాలతో ముఖాన్ని పూర్తిగా కప్పేసుకున్న ఆమెను తొలిచూపులో ఎవరూ గుర్తించలేకపోయారు. గత కొద్దిరోజులుగా ప్రజలకు, మీడియాకు దూరంగా ఉన్న సయానీ ఘోష్ ఒక్కసారిగా ఇలా ప్రత్యక్షమవడంతో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఎయిర్‌పోర్టులో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవల టీఎంసీలో అంతర్గత విభేదాలు, తిరుగుబాటు స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో సయానీ ఘోష్ పేరు కూడా చర్చలోకి రావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో మమతా బెనర్జీకి (Mamata Banerjee) మద్దతుగా బలంగా నిలిచిన ఆమె, ఎన్నికల ప్రచారంలో పార్టీ తరపున కీలక పాత్ర పోషించారు. అలాంటి నాయకురాలు ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లి, గెటప్ మార్చుకుని కనిపించడంతో రాజకీయ విశ్లేషకులు పలు కోణాల్లో చర్చిస్తున్నారు. అయితే ఈ పరిణామాలపై సయానీ ఘోష్ లేదా టీఎంసీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment