లక్నో సూపర్ జెయింట్స్‌పై 40 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ సత్తా

లక్నో సూపర్ జెయింట్స్‌పై 40 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ సత్తా

రాజస్థాన్‌ రాయల్స్‌ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. లక్నో సూపర్‌ జెయింట్స్ తో జరిగిన కీలక పోరులో 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 6 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేసినా, బౌలర్ల అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను తమవైపు తిప్పుకుంది. ముఖ్యంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అసాధారణ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 29 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టుకు బలమైన స్కోర్ అందించిన జడేజా, బౌలింగ్‌లోనూ మెరిపించి 29 పరుగులకే ఒక వికెట్ తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. తన విజయం వెనుక తన భార్య, గుజరాత్ విద్యాశాఖ మంత్రి రివాబాకు జడేజా ప్రోత్సాహం ఉందని చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

మ్యాచ్ అనంతరం జడేజా మాట్లాడుతూ ఈ అవార్డును తన భార్యకు అంకితం చేస్తున్నానని భావోద్వేగంగా తెలిపాడు. “ఆమె నిన్ననే నువ్వు రేపు అద్భుతం చేస్తావని చెప్పింది, అదే నిజమైంది” అని పేర్కొన్నాడు. పిచ్ పరిస్థితులు కఠినంగా ఉన్నాయని, బంతి స్వింగ్, సీమ్ అవుతున్నందున క్రీజ్‌లో నిలబడటం కీలకమైందని చెప్పాడు. బౌలింగ్‌లో స్లో బాల్స్, వేగం మార్పులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసినట్టు వెల్లడించాడు. ముఖ్యంగా నికోలస్ పూరన్ వికెట్ తీసిన తర్వాత చేసిన సెలబ్రేషన్‌పై మాట్లాడుతూ అది క్షణంలో వచ్చిన స్పందన మాత్రమేనని తెలిపాడు. మొత్తం మీద జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శన ఆర్ఆర్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment