మళ్లీ మహిళలే టీడీపీ టార్గెట్‌.. నెట్టింట విమర్శల వెల్లువ

మళ్లీ మహిళలే టీడీపీ టార్గెట్‌.. నెట్టింట విమర్శల వెల్లువ

తెలుగుదేశం పార్టీ రాజకీయ వైఖరిపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి జైలుకు పంపించినా, ఆయనపై టీడీపీ ఆగ్రహం ఇంకా చల్లారలేదన్న అభిప్రాయం నెట్టింట వ్యక్తమవుతోంది. తాజాగా అంబటి రాంబాబు కుమార్తెలను టార్గెట్ చేస్తూ టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో దిగజారుడు పోస్టులు చేయడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

గతంలో బాలకృష్ణ ఇంటి నుంచే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిలపై దుష్ప్రచారం చేసి ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగినట్టుగానే, ఇప్పుడు అంబటి కుమార్తెలపై కూడా కుట్రపూరిత ప్రచారం జరుగుతోందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అంబటి రాంబాబు కుమార్తెలు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులను వివాహం చేసుకున్నారంటూ ఒకే ఫార్మాట్‌లో టీడీపీ సపోర్టర్స్ వరుస ట్వీట్లు వేయడం తీవ్ర చర్చకు దారి తీసింది.

మౌనిక మాటలే కారణమా?
అంబటి రాంబాబు ఇంటిపై దాడి అనంతరం ఆయన కుమార్తె మౌనిక మీడియా ముందు మాట్లాడిన మాటలు అధికార పక్షాన్ని ఇబ్బందికి గురి చేశాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత మూడు రోజులుగా 30–40 మంది టీడీపీ నేతలు మీడియా ముందుకు వ‌చ్చినా, మౌనిక వేసిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఎదురుదాడికి దిగిన టీడీపీ శ్రేణులు, ఎప్పటిలాగే వ్యక్తిత్వ హననం వైపు వెళ్లాయని విమర్శలు వస్తున్నాయి.

అంబటి కుమార్తెల పేర్లు, వారి వివాహ వివరాలను బహిర్గతం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, మహిళలపై మరో సోషల్ వార్‌కు దిగడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఇంటర్‌కాస్ట్ మ్యారేజీల పేరుతో దిగజారుడు వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.

ఇంటర్‌కాస్ట్ పెళ్లిళ్ల చిట్టా తెరిస్తే…?
“ఇంటర్‌కాస్ట్ పెళ్లిళ్ల గురించి మాట్లాడితే ముందుగా తెలుగుదేశం పార్టీలోనే ఆ లిస్ట్ ఎక్కడికో వెళ్లిపోతుంది” అంటూ నెటిజన్లు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. గుంటూరులో అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయించిన బీసీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం గుర్తు చేస్తున్నారు.

అదేవిధంగా
హోంమంత్రి అనిత దళిత కాగా, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, క‌మ్మ‌ సామాజిక వర్గానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నారు.
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష బ‌ల‌హీన వర్గానికి చెందినవారు కాగా, కమ్మ సామాజిక వర్గానికి చెందని వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

అంతేకాదు…
“సీఎం చంద్రబాబు తమ్ముడి కుమారుడు నారా రోహిత్ వివాహం చేసుకున్న యువతి ఏ కులం?”
“జనసేన ఎమ్మెల్సీ, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి ఏ కాస్ట్?”
“లోకేష్ పాదయాత్రలో గుండెపోటుతో మృతి చెందిన నందమూరి తారకరత్న పెళ్లి చేసుకున్న మహిళ రెడ్డి కాదా?”
“చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ పెళ్లి చేసుకున్న ఉపాసన కాస్ట్ రెడ్డి కాదా?” అంటూ నెటిజన్లు టీడీపీ శ్రేణులను ప్రశ్నిస్తున్నారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజీ, నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తప్పా.. అని నిలదీస్తున్నారు.

అంబటి రాంబాబు వైఖరి స్పష్టం
మాజీ మంత్రి అంబటి రాంబాబు తన కుమార్తెల వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ దాచలేదని, మహిళలు స్వాభిమానంతో ఎదగాలనే ఆలోచనతోనే వారిని పెంచారని సన్నిహితులు చెబుతున్నారు. చదువులు, పెళ్లిళ్ల విషయంలో కుమార్తెలపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని, వారి జీవితం వారి ఇష్టానికే వదిలేశారని అంటున్నారు. కుమార్తెల‌పై బ‌ల‌వంత‌పు పెళ్లి అనే జాడ్యాన్ని ర‌ద్దులేద‌ని అంబటి స‌న్నిహితులు పేర్కొంటున్నారు.

రాజకీయాలకు సంబంధం లేని మహిళలపై దాడి?
రాజకీయాలతో సంబంధం లేని ఓ మహిళ, తన ఇంటిపై, తన తండ్రిపై జరిగిన దాడిని ఖండిస్తూ మీడియా ముందుకు వస్తే… ఆమెను, ఆమె తోబుట్టువులను, వారి పెళ్లిళ్లను, భర్తల వివరాలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం దారుణమని నెటిజన్లు మండిపడుతున్నారు. “మళ్లీ మహిళలనే టార్గెట్ చేస్తూ టీడీపీ సైకోలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు” అంటూ సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment