పట్టాభి వైఖరి.. గుండెపోటుతో GVMC ఉద్యోగి మృతి! (Video)

పట్టాభి ద‌బాయింపు.. గుండెపోటుతో GVMC ఉద్యోగి మృతి!

తెలుగుదేశం పార్టీ నేత‌(Telugu Desam Party), స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ చైర్మ‌న్ (Swachh Andhra Corporation) ప‌ట్టాభి (Pattabhi) వైఖ‌రి ఓ సీనియ‌ర్ ఇంజినీరింగ్ అధికారి నిండు ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. గ్రేట‌ర్ విశాఖ కార్పొరేష‌న్ (జీవీఎంసీ) (GVMC) సూపరింటెండింగ్ ఇంజనీర్ GVMC) జి. గోవిందరావు (G. Govindarao), ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి నిర్వహించిన సమీక్షలో గుండెపోటు (Heart Attack)తో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. ఉద్యోగులపై మానసిక ఒత్తిడి పెంచుతూ, భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించడమే ఈ దారుణానికి కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గాజువాక జోనల్ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో సీనియ‌ర్ అధికారి గోవిందరావుపై స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ట్టాభి తీవ్రంగా విరుచుకుపడుతూ ప్రశ్నల వర్షం కురిపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాస్త సమయం ఇవ్వాలని, పత్రాలు చూసుకుని సమాధానాలు చెబుతానని గోవిందరావు వేడుకున్నా పట్టాభి వినకుండా అరవడంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

తక్షణమే ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమీక్ష సమావేశం మధ్యలోనే ఒక అధికారి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చెమ‌ట‌లు ప‌డుతున్నాయి సార్‌.. కాస్త టైమ్ ఇవ్వండి.. అని చెప్ప‌టికీ ప‌ట్టాభి వినిపించుకోలేద‌ని ఉద్యోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ప‌ట్టాభి వెంట‌నే రాజీనామా చేయాలి
ఈ ఘటనపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో ఓ కంపెనీకి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు, లంచాల కోసమే పట్టాభి ఈ రివ్యూ పెట్టారని, అదే ఒత్తిడి గోవిందరావు మృతికి దారితీసిందని వైసీపీ నేతలు ఆరోపించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ ఒత్తిడి వల్లే జీవీఎంసీ ఉద్యోగి మరణించారని బాణాల శ్రీనివాస్, కట్టుమూరి సతీష్ వంటి నేతలు విమర్శించారు.

కూటమి పాలనలో ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని, ప్రభుత్వ వైఫల్యాలను ఉద్యోగులపై నెట్టేస్తూ నాయకులు వేధింపులకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ పట్టాభి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేయర్ లేకుండానే సమీక్షలు పెట్టే అర్హత పట్టాభికి లేదని, వెంటనే ఆయన్ను చైర్మన్ పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment