WPL సీజన్ ప్రారంభం

WPL సీజన్ ప్రారంభం

Summarize with AI

టీ20 ప్రపంచకప్‌ 2026 (T20 World Cup 2026), ఐపీఎల్‌ 2026 (IPL 2026)కి ముందు క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో ఉత్సాహభరితమైన టోర్నీ ప్రారంభం కానుంది. మహిళల ప్రిమియర్‌ లీగ్‌ 2026 (Women’s Premier League – WPL 2026) ఈరోజు ప్రారంభమవుతోంది. తొలి మ్యాచ్‌లో మాజీ విజేత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఎదుర్కొంటుంది. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌ల్లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుండగా, మ్యాచ్‌ ప్రారంభోత్సవ వేడుకల్లో గాయకుడు యోయో హనీసింగ్, నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

డబ్ల్యూపీఎల్‌ 2026లో ముంబై జట్టు సత్తా చూపేలా ఉంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, నాట్‌ సీవర్‌ బ్రంట్, హేలీ మాథ్యూస్‌, అమేలియా కెర్‌, అమన్‌జ్యోత్‌, గుణాలన్ కమలి బ్యాటింగ్‌లో బలంగా ఉన్నాయి. ఫాస్ట్‌బౌలర్‌ షబ్నిమ్‌ ఇస్మాయిల్ బౌలింగ్‌లో నాయకత్వం వహిస్తుండగా, నాణ్యమైన స్పిన్నర్‌ సైకా ఇషాక్‌ జట్టులో ఉంది. బెంగళూరు జట్టు కూడా స్మృతి మంధాన, జార్జియా వోల్, గ్రేస్ హారిస్, నదైన్ డిక్లెర్క్‌, రిచా ఘోష్‌తో మద్దతుగా నిలిచింది. టోర్నీ డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్లో జరుగుతుంది. 5 జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడి, టేబుల్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కి చేరుకుంటాయి. లీగ్‌ టాప్‌ టీం నేరుగా ఫైనల్‌కు వెళ్లగా, రెండో, మూడో స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్‌లో తలపడతాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment