”కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ల దిష్టి”.. పవన్ వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం

''కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ల దిష్టి''.. పవన్ వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం

కోనసీమ (Konaseema) ప్రాంతంలో కొబ్బరి చెట్లు (Coconut Trees) ఎండిపోవడంపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (Pawan Kalyan) … తెలంగాణ (Telangana) వాసుల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు కొత్త వివాదానికి దారి తీసాయి. “కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలేసింది.. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే” అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలు పొరుగు రాష్ట్రం తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయని విమర్శకులు పేర్కొంటున్నారు.

వీడియో వైర‌ల్‌.. తెలంగాణ వాదుల ఆగ్రహం
తెలంగాణ వాదుల‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావడంతో తెలంగాణ సోషల్ మీడియా యాక్టివిస్టులు, తెలుగువారు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. “మా ప్రాంత ప్రజలను నిందించే హ‌క్క నీక్కెక్కడి నుంచి వచ్చింది? మా హైదరాబాద్‌ (Hyderabad)లో ఉంటూ, మా రాష్ట్ర ప్ర‌జ‌ల‌నే కించ‌ప‌రిచేలా మాట్లాడుతావా?” అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఏపీ ప్రజల నుంచి కూడా విమర్శలు
ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యలు కేవలం తెలంగాణ వాదులనే కాదు, ఏపీ ప్రజలలో కూడా అసంతృప్తిని రేపాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి “నర దిష్టి తగిలి కొబ్బరి చెట్లు ఎండిపోయాయి” అని మాట్లాడటం బాధ్యతారాహిత్యమని మరికొందరు అంటున్నారు. మీరు శాస్త్రీయ కారణాలు చెప్పాలి గానీ, న‌ర దిష్టి, న‌ల్ల‌రాయి, న‌ల‌భై ఏళ్లు అని వ్యాఖ్యలు చేయడం దారుణ‌మ‌ని తిట్టిపోస్తున్నారు.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు
ఒక పార్టీకి అధ్య‌క్షుడి హోదాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన‌ వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమని అభిప్రాయపడుతున్నారు. “ఉప ముఖ్యమంత్రి వంటి పదవిలో ఉన్న వ్యక్తి మరో రాష్ట్ర ప్రజలపై కించపరిచేలా మాట్లాడటం అసలు సరైంది కాదు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరగడానికి ఇది దోహదపడుతుంది” అని విశ్లేషకులు అంటున్నారు. ఎండిపోతున్న కొబ్బరి చెట్లపై ప్రభుత్వం శాస్త్రీయ, వ్యవసాయ ఆధారిత సమాధానాలు ఇవ్వాలి కానీ వివాదాస్పద వ్యాఖ్యలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తాయని వారు చెబుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment