త్వరలో రాజయ్యపేటకు జగన్.. హోంమంత్రిపై బొత్స ఫైర్‌

త్వరలోనే రాజయ్యపేటకు జగన్.. హోంమంత్రిపై బొత్స ఫైర్‌

బల్క్ డ్రగ్ పార్క్(Bulk Drug Park) విష‌యంలో గత 39 రోజులుగా సాగుతున్న రాజ‌య్య‌పేట‌ మత్స్యకారుల ఉద్యమం ఒక కొత్త మలుపు తీసుకుంది. మాజీ సీఎం జగన్(Jagan) ఆదేశాల మేరకు వైసీపీ నేత‌లు చలో రాజయ్యపేట కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ మత్స్యకారులు సాగిస్తున్న ఉద్య‌మానికి బొత్స సత్యనారాయణ (Botcha Satyanarayana), కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, ముత్యాల నాయుడు, ధర్మశ్రీ, కేకే రాజు పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.

మా ఊరి ఆడ‌పిల్ల అని చెప్పి మోసం చేసింది..
వైసీపీ నేత‌ల ఎదుట మ‌త్స్య‌కారులు తమ సమస్యలను విన్నవించారు. హోంమంత్రి అనిత త‌మ‌ను నమ్మించి మోసం చేసిందని రాజ‌య్య‌పేట గ్రామ‌స్తులు మండిప‌డ్డారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయ‌బోమ‌ని చెప్పింద‌ని, త‌మ‌ ఊరి ఆడపిల్ల అని చెప్పినందుకు ఆమెను నమ్మి త‌మ‌ గ్రామం నుంచి 2000 మెజార్టీ ఇచ్చామన్నారు. గెలిచిన త‌రువాత త‌మ‌ను మోసం చేసింద‌ని మ‌త్స్య‌కారులు వాపోయారు. త‌మ‌ను చంపి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయండి అంటూ హోంమంత్రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏం పాపం చేశామని త‌మ‌ను వేధిస్తున్నార‌ని, మా ప్రాణాల పోయినా బల్క్ డ్రగ్ పార్కు కట్టనివ్వబోమ‌న్నారు.

చేత‌గాక‌పోతే రాజ‌కీయాలు వ‌దులుకో.. – బొత్స‌
ప్రభుత్వాలు ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడుకోవాలి కానీ, తీయ‌డానికి కాదని శాస‌న‌మండ‌లి విప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. తాము వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాజ‌య్య‌పేట‌కు వ‌చ్చామ‌ని చెప్పారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు పెట్టాలని కూట‌మి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. రాజయ్య పేట గ్రామస్తుల ఆధార్ కార్డులు ఎందుకు అడుగుతున్నారని ప్ర‌శ్నించారు. ఎన్నికలకు ముందు క్యాన్సర్, పిల్లలకు అంగవైకల్యం వస్తుందని చెప్పిన అనిత‌.. మంత్రి అయ్యాక మ‌త్స్య‌కారుల జీవితాల‌తో ఆడుకోవ‌డం న్యాయ‌మా.. అని నిల‌దీశారు. రాజయ్యపేట పర్యటనపై అనేక ఆంక్షలు పెట్టారని, తాము ఏమైనా సంఘవిద్రోహశక్తులుమా..? అని ప్ర‌శ్నించారు. చేతకాకపోతే రాజకీయాలు వదులుకో అని హోంమంత్రి అనిత‌పై ఫైర‌య్యారు.

త్వ‌ర‌లో రాజ‌య్య‌పేట‌కు మాజీ సీఎం
మాజీ సీఎం జగన్ మ‌త్స్యాకారుల కోరికను నెరవేరుస్తారని, కూటమి ప్రభుత్వం పెట్టే కేసులను వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక తొల‌గిస్తార‌ని బొత్స హామీ ఇచ్చారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని, తప్పు చేసిన కూటమికి శిక్ష తప్పదని హెచ్చ‌రించారు. మ‌త్స్య‌కారులు చెప్పిన ప్రతి మాటను జగన్ దృష్టికి వెళ్తామ‌న్నారు. త్వ‌ర‌లో రాజ‌య్య‌పేట‌ను వైఎస్ జ‌గ‌న్ సంద‌ర్శిస్తార‌ని బొత్స చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment