‘మాకు రూల్స్ తెలుసు’.. పిచ్ క్యూరేటర్‌పై శుబ్‌మన్ గిల్ ఫైర్!

'మాకు రూల్స్ తెలుసు'.. పిచ్ క్యూరేటర్‌పై శుబ్‌మన్ గిల్ ఫైర్!

Summarize with AI

ఇంగ్లండ్-భారత్ (England–India) మధ్య ఐదో టెస్టు (Fifth Test) మ్యాచ్ (Match) ప్రారంభానికి ముందే వివాదంలో చిక్కుకుంది. టీమిండియా (Team India) హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), ఓవల్ పిచ్ క్యూరేటర్ (Curator) లీ ఫోర్టిస్ (Lee Fortis) మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం పిచ్‌ను పరిశీలిస్తున్న భారత బృందం దగ్గరికి వచ్చిన ఫోర్టిస్.. పిచ్‌ను రెండున్నర మీటర్ల దూరం నుంచి మాత్రమే పరిశీలించాలని సూచించాడు.

అతడి మాటలకు గంభీర్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఈ క్రమంలో ప్రధాన కోచ్ పిచ్ క్యూరేటర్‌తో వాగ్వాదానికి దిగాడు. అక్కడే ఉన్న భారత బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ (Sitanshu Kotak) సైతం లీ ప్రవర్తన పట్ల అసహనం వ్యక్తం చేశాడు. తాజాగా ఈ వివాదంపై టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) స్పందించాడు. లీ ఫోర్టిస్‌పై గిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

“నా కెరీర్‌లో చాలా మ్యాచ్‌లు ఆడాను. మ్యాచ్‌కు ముందు ప్రధాన పిచ్‌ను రెండున్నర మీటర్ల దూరం నుంచి పరిశీలించాలని ఇప్పటివరకు ఏ క్యూరేటర్ కూడా నాతో చెప్పలేదు. రబ్బర్ స్పైక్స్ లేదా బేర్‌ఫుట్ (చెప్పులు లేకుండా) తో పిచ్‌ను దగ్గరగా వెళ్లి పరిశీలించవచ్చు. మాకు రూల్స్ తెలుసు” అని గిల్ పేర్కొన్నాడు.

“ఒకవేళ స్పైక్స్ ఉన్న షూలను వేసుకున్నట్లయితే క్యూరేటర్ మమ్మల్ని అడ్డుకోవచ్చు. కానీ మేము అటువంటి షూలను ధరించలేదు. అయినా క్యూరేటర్ మమ్మల్ని ఎందుకు ఆపాడో అర్థం కావడం లేదు. మేము ఇప్పటివరకు ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడాము. ఏ క్యూరేటర్ కూడా మాకు ఇలాంటి సూచనలు ఇవ్వలేదు” అని ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ స్పష్టం చేశాడు.

కాగా, ఐదో టెస్టు గురువారం (జులై 31, 2025) నుంచి ఓవల్ మైదానం వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం ఎలాగైనా పర్యాటక జట్టును ఓడించి 3-1 తేడాతో సిరీస్ దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment