ముంచుకొస్తున్న‌ కొవిడ్ మ‌హ‌మ్మారి.. ఆ దేశాల్లో వేల‌ల్లో కేసులు

ముంచుకొస్తున్న‌ కొవిడ్ మ‌హ‌మ్మారి.. ఆ దేశాల్లో వేల‌ల్లో కేసులు

ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ (COVID) మహమ్మారి (Pandemic) మరోసారి తన భీకర రూపాన్ని చూపిస్తూ ముంచుకొస్తోంది. రెండు దేశాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో మళ్లీ మాస్క్ ధరించడం త‌ప్ప‌నిస‌రి అయ్యింది. ఇదే సమయంలో, కొవిడ్‌తో పాటు అడినోవైరస్ (Adenovirus), రైనోవైరస్‌లు (Rhinoviruses) కూడా వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ, కొత్త వైరస్‌లపై అధ్యయనం ప్రారంభించింది.

హాంకాంగ్, సింగపూర్‌లో కొవిడ్ కేసులు
హాంకాంగ్ (Hong Kong), సింగపూర్‌ (Singapore)‌లో జన సాంద్రత అధికంగా ఉన్న నగరాల్లో కొవిడ్ కేసులు (COVID Cases) గత వారం నుంచి గణనీయంగా పెరుగుతున్నాయి. సింగపూర్‌లో ఈ నెల 3వ తేదీన తొలి కేసు నమోదైనప్పటి నుంచి, కేవలం ఒక వారంలోపే కేసుల సంఖ్య 14,200కి చేరుకుంది. హాంకాంగ్‌లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా మారింది, ముఖ్యంగా 17 నెలలు, 13 నెలల వయస్సు గల చిన్నారులకు వైరస్ సోకిన ఘటనలు ఆందోళనను మరింత పెంచాయి. ఈ పరిణామాలు ఆసియా ఖండంలో కొత్త కొవిడ్ ఉప్పెన తీవ్రతను సూచిస్తున్నాయి.

ఈ రెండు దేశాల ఆరోగ్య అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, కొవిడ్ నివారణ చర్యలను కఠినంగా పాటించాలని సూచించారు. హాంకాంగ్‌లో ప్రస్తుత కేసుల పెరుగుదల నేపథ్యంలో మళ్లీ మాస్క్ ధరించడం తప్పనిసరిగా ప్రకటించారు. సింగపూర్ కూడా ఇదే దిశగా అడుగులు వేస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని తిరిగి అమలు చేసింది.

అడినోవైరస్, రైనోవైరస్‌ల వ్యాప్తి
హాంకాంగ్, సింగపూర్‌లో కోవిడ్‌తో అడినోవైరస్, రైనోవైరస్‌లు కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ వైరస్‌లు ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కలిగిస్తాయి. పిల్లలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. హాంకాంగ్‌లో కొవిడ్ నియంత్రణ చర్యలు సడలించిన తర్వాత, రైనోవైరస్/ఎంటెరోవైరస్‌లు ప్రబలంగా వ్యాప్తి చెందాయని, అడినోవైరస్ ముఖ్యంగా పీడియాట్రిక్ రోగులలో ఎక్కువగా కనిపిస్తోందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

భారత్‌లో పరిస్థితి
ప్రస్తుతానికి భారత్‌లో కొవిడ్ కేసులు లేవు. అయితే, హాంకాంగ్, సింగపూర్‌లోని పరిణామాలు భారత ఆరోగ్య అధికారులను అప్రమత్తం చేశాయి. భారత్‌లో గతంలో ఒమిక్రాన్ వేరియంట్ వల్ల తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్న అనుభ‌వం ఉంది. కొత్త వేరియంట్ల వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment