నేత‌న్న‌ల‌కు మాట ఇస్తున్నా.. జ‌గ‌న్ ఆసక్తిక‌ర ట్వీట్‌

నేత‌న్న‌ల‌కు మాట ఇస్తున్నా.. జ‌గ‌న్ ఆసక్తిక‌ర ట్వీట్‌

Summarize with AI

జాతీయ చేనేత దినోత్సవం (National Handloom Day) సందర్భంగా వైసీపీ(YSRCP) అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) రాష్ట్రంలోని చేనేత కళాకారులు(Handloom Artisans), వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, అది మన సంస్కృతి, సంప్రదాయాలకు, తెలుగువారి కళా నైపుణ్యానికి నిలువెత్తు ప్రతీక అని ఆయన కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదిక‌గా ఒక ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశారు.

తన పాలనలో (2019-2024) చేనేత రంగానికి చేసిన సంక్షేమాన్ని వివరిస్తూనే, ప్రస్తుత చంద్రబాబు(Chandrababu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం (Coalition Government) నేతన్నలకు చేస్తున్న అన్యాయాన్ని జగన్ తీవ్రంగా తప్పుపట్టారు.

గత వైసీపీ ప్రభుత్వంలో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా (Financial Security) కల్పించేందుకు ప్రతి అడుగులోనూ అండగా నిలిచామని జగన్ గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం ప‌థ‌కం (YSR Nethanna Nestham Scheme) ద్వారా అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ. 24,000 చొప్పున ఐదేళ్లలో రూ. 1.20 లక్షలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశాం. ఈ ఒక్క పథకం ద్వారానే రూ. 969.77 కోట్లు అందించామ‌న్నారు.

నేతన్నల పింఛన్ల కోసం రూ. 1,396.45 కోట్లు, ఆప్కో (APCO) పాత బకాయిల చెల్లింపునకు రూ. 468.84 కోట్లు వెచ్చించామ‌ని, వివిధ సంక్షేమ పథకాల ద్వారా వైసీపీ ప్రభుత్వ హయాంలో (YSRCP Government) మొత్తంగా రూ. 3,706.16 కోట్ల సాయం అందించి నేతన్నలకు ఆర్థికంగా, సామాజికంగా మద్దతుగా నిలిచామ‌ని వివ‌రించారు.

చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్(Free Electricity), పవర్ లూమ్స్‌కు(Power Looms) రాయితీ విద్యుత్ అందించామ‌ని, అలాగే, నేతన్నలు తయారు చేసే వస్త్రాలకు దేశ, విదేశాల్లో మార్కెటింగ్ కల్పించేందుకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని అంతర్జాతీయ గుర్తింపు తెచ్చామ‌న్నారు.

కూటమి ప్రభుత్వంపై విమర్శలు
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నలను తీవ్రంగా మోసం చేశారని జగన్ ఆరోపించారు. ఏడాదికి రూ. 25,000 ఇస్తామని చెప్పి, ‘నేతన్న నేస్తం’(Nethanna Nestham) పథకాన్ని నిలిపివేశారని చెప్పారు. హ్యాండ్‌లూమ్స్‌కు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీని గాలికి వదిలేశారు. జీఎస్టీ (GST) రీయింబర్స్‌మెంట్ హామీని కూడా అమలు చేయడం లేదన్నారు. మొదట 1,03,534 కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం 71,536 కుటుంబాలకే ఇస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. చివరికి ఎంతమందికి ఇస్తారో చూడాలంటూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వ తీరుపై సెటైర్లు వేశారు.

చేనేత కార్మికుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం, చేనేత రంగ పరిరక్షణ కోసం వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment