పెట్రోల్ బాంబులతో ఎంపీపై హ‌త్యాయ‌త్నం

పెట్రోల్ బాంబులతో ఎంపీపై హ‌త్యాయ‌త్నం

Summarize with AI

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు (Local Body Elections) మొద‌లైన నాటి నుంచి అధికార తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)అరాచ‌కాలు మితిమీరిపోతున్నాయి. క‌ర్ర‌లు, రాళ్లు, పెట్రోల్ బాంబుల‌తో దాడుల‌కు తెగ‌బ‌డుతున్నా.. పోలీసులు, ఎన్నిక‌ల క‌మిష‌న్ క‌నీస చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో పేట్రేగిపోతున్నారు.

పుంగ‌నూరులో(Punganur) ఎంపీపై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న‌ను మ‌రువ‌క‌ముందే.. తాజాగా వైఎస్సార్ జిల్లా(YSR District) సింహాద్రిపురంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల (Panchayat Elections Nominations) సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కోసం వెళ్లిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) కాన్వాయ్‌పై (Convoy) రాళ్లు(Stones), పెట్రోల్ బాంబులతో(Petrol Bombs) హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ‌డం సంచ‌ల‌నం రేపుతోంది.

టీడీపీ(TDP) నేత బీటెక్ రవి (B.Tech Ravi) తన అనుచరులను రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పడంతో పాటు స్వయంగా దాడిలో పాల్గొన్నారని వైసీపీ ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎంపీపై హత్యాయత్నం (Murder Attempt) జరిగిందని వైసీపీ మండిపడుతోంది.

దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు సర్పంచ్ అభ్యర్థులతో కలిసి ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అవినాష్ రెడ్డినే అదుపులోకి తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఎంపీని కస్టడీలోకి తీసుకుంటామని డీఎస్పీ మురళీ నాయక్ (Murali Naik) పేర్కొనడంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను (YSRCP Candidates) నామినేషన్లు దాఖలు చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని, వారికి అండగా నిలిచిన ఎంపీపై పెట్రోల్ బాంబులతో దాడి చేయడం దారుణమని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్పీ మురళీ నాయక్ తీరును తీవ్రంగా తప్పుబడుతూ, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment