వైసీపీ ‘ఫీజు పోరు’ వాయిదా.. ఎప్పుడంటే..

వైసీపీ ‘ఫీజు పోరు’ వాయిదా.. ఎప్పుడంటే..

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బ‌కాయిల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని, విద్యా సంస్థ‌ల్లో త‌లెత్తుతున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ ఈనెల 5వ తేదీన నిర్వ‌హించ త‌ల‌పెట్టిన‌ ‘ఫీజు పోరు’కు ప్ర‌తిప‌క్ష వైసీపీ వాయిదా వేసుకుంది. ఈనెల 5న నిర్వ‌హించాల్సిన కార్య‌క్ర‌మాన్ని మార్చి 12వ తేదీకి పోస్ట్‌పోన్ చేస్తున్న‌ట్లుగా వైసీపీ కేంద్ర కార్యాల‌యం ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

కార‌ణం ఏంటంటే..
ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వైసీపీ పేర్కొంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరినా, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదని, దీంతో ఆ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మార్చి 12వ తేదీన ‘ఫీజు పోరు’ నిర్వహించాలని నిర్ణయించిన‌ట్లు ప్ర‌క‌టించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment