వైఎస్సార్ జిల్లాలో రాజకీయ వేడి మరోసారి పెరిగింది. ఇటీవల బీజేపీ (BJP) ఎమ్మెల్యే (MLA) ఆదినారాయణరెడ్డి (Adinarayana Reddy) చేసిన వ్యాఖ్యలపై కడప (Kadapa) వైసీపీ (YSRCP) ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Y.S. Avinash Reddy) తీవ్రంగా స్పందించారు. ఆదినారాయణరెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల (Medical Colleges) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనల ఇలాంటి సమయంలో ఆదినారాయణరెడ్డి, సోది నారాయణరెడ్డిలాంటి వాళ్లు మాకు అవసరమా?” అని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు.
“మొన్న ఆయన మాట్లాడిన మాటలు నేనూ చూశా. పులివెందుల వాళ్లను పదే పదే రెచ్చగొడుతున్నాడు. ఏం పీకుతారు అంటూ మాట్లాడుతున్నాడు. మా వాళ్లు సంయమనంగా ఉన్నారు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ అవినాష్‌రెడ్డి.. మా వాళ్లు సంయమనం కోల్పోతే నీ ఇంట్లోకే వచ్చి కూర్చుంటారు. కాబట్టి మర్యాదగా మాట్లాడమని హితవు పలుకుతున్నాను అని హెచ్చరించారు. ఆదినారాయణరెడ్డికి ఎంపీ అవినాష్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్
— Telugu Feed (@Telugufeedsite) November 12, 2025
ఏం పీకుతారు అంటూ మాట్లాడుతున్నాడు..
మా వాళ్లు సంయమనంగా ఉన్నారు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు. మా వాళ్లు సంయమనం కోల్పోతే నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు. pic.twitter.com/xj07s8Rl6p








