రంగా వ‌ర్ధంతి.. అంబటి రాంబాబు సంచలన ట్వీట్

రంగా వ‌ర్ధంతి.. అంబటి రాంబాబు సంచలన ట్వీట్

Summarize with AI

వంగవీటి మోహన రంగా వర్ధంతి రోజున వైసీపీ నేత‌, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. టీడీపీ టార్గెట్‌గా అంబ‌టి ఓ ట్వీట్ చేశారు. అంబ‌టి ట్వీట్ ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచింది. “దీక్షలో ఉన్న ధీరుడిని టీడీపీ గూండాలు హతమార్చి నేటికి 36 సంవత్సరాలు. జోహార్ వంగవీటి మోహన రంగా” అని ఆయన ఎక్స్‌ (ట్విట్టర్) వేదిక‌గా ఓ పోస్టు పెట్టారు. అంబ‌టి ట్వీట్‌పై టీడీపీ మండిప‌డుతోంది.

1988లో విజయవాడలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో వంగవీటి మోహన రంగా ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈ సంఘటన ఆ సమయంలో తీవ్ర కలకలం రేపింది. అంబటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలు మళ్ళీ ఆ రోజుల్ని గుర్తుచేసేలా చేశాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment