తునిలో వైసీపీకి వదిలిన తలనొప్పి!

తునిలో వైసీపీకి వదిలిన తలనొప్పి!

Summarize with AI

కాకినాడ జిల్లా(Kakinada District) తుని నియోజకవర్గ (Tuni Constituency) వైసీపీకి(YSRCP) ఉన్న పెద్ద తలనొప్పి వదిలిపోయింది. 2024 ఎన్నికల్లో(2024 Elections) తెలుగుదేశం పార్టీ టికెట్ (TDP Ticket) నిరాకరించడంతో, ఆ కోపంతో ఎన్నికల సమయంలో వైసీపీ(YSRCP) గూటికి చేరిన యనమల కృష్ణుడు తాజాగా జనసేన పార్టీ (Jana Sena Party) కండువా కప్పుకున్నారు. కృష్ణుడు పార్టీని వీడటంతో తుని వైసీపీ శ్రేణులు ”హ‌మ్మ‌య్యా”.. అంటూ రిలాక్స్ అవుతున్నాయి.

రెండు పడవల ప్రయాణం..
2024 ఎన్నికల్లో(2024 Elections) నామినేషన్ల ప్రక్రియ (Nomination Process) ప్రారంభమైన తర్వాత వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు(Yanamala Krishnudu), ఆ తర్వాత పార్టీ కోసం గానీ, ప్రజల సమస్యలపై గానీ ఎన్నడూ గొంతు విప్పలేదు. వైసీపీలో కొనసాగుతూనే తెరవెనుక టీడీపీ(TDP) అగ్రనేతలతో సంబంధాలు కొనసాగించారు. పార్టీ నియమావళికి విరుద్ధంగా తుని వైసీపీలో కోవర్టు గ్రూపులను తయారు చేసే ప్రయత్నం చేశారు.

తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తుండటంతో వైసీపీ అధినాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆయనపై చర్యలకు సిద్ధమవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జనసేన వైపు అడుగులు వేశారు.

కృష్ణుడు లేకుండా రెండుసార్లు విజయం
తుని నియోజ‌క‌వ‌ర్గ రాజకీయ స‌మీక‌ర‌ణాల‌ను ప‌రిశీలిస్తే.. యనమల కృష్ణుడు (Yanamala Krishnudu) వైసీపీలో ఉండటం వల్ల ఒరిగిన ప్రయోజనమేమీ లేకపోగా, ఆయన ప్రత్యర్థిగా ఉన్నప్పుడే వైసీపీ అద్భుత విజయాలు సాధించింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా(Dadisetti Raja).. యనమల కృష్ణుడిపైనే భారీ మెజార్టీలతో గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్య‌ర్థిగా ఉన్న య‌న‌మ‌ల కృష్ణుడుపై దాడిశెట్టి రాజా 18,573 ఓట్ల మెజార్టీతో, 2019 ఎన్నిక‌ల్లో 24,016 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

కృష్ణుడు వైరి వర్గంలో ఉన్నంతసేపూ వైసీపీ వరుసగా గెలుస్తూ బలమైన శక్తిగా నిలబడింది. కానీ 2024లో ఆయన పార్టీలోకి రావడం వల్లే అంతర్గత కలహాలు పెరిగి వైసీపీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

అన్న ప్రోద్బలంతో మ‌రో కొత్త పార్టీలోకి..
తన తమ్ముడు కృష్ణుడిని జనసేనలోకి (Jana Sena)పంపడం వెనుక అన్న యనమల రామకృష్ణుడు హస్తం ఉందనే చర్చ నియోజకవర్గంలో గట్టిగా నడుస్తోంది. రెండు పడవల ప్రయాణంతో వైసీపీకి చెడ్డపేరు తెచ్చిన కృష్ణుడిని వైసీపీ పూర్తిగా పక్కన పెట్టడంతో, ఇప్పుడు ఆ తలనొప్పిని కొత్తగా జనసేన నెత్తిన వేసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా, పార్టీలో ఉంటూ గ్రూపు రాజకీయాలు నడిపిన నాయకుడు వెళ్లడంతో వైసీపీ క్యాడర్ కూడా సంతోషంగా ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment