సీఎం చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో(State Secretariat) జరిగిన మంత్రివర్గ సమావేశంలో(Cabinet Meeting) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 30కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. ఐటీ, పరిశ్రమలు, రెవెన్యూ, హోంశాఖల ప్రతిపాదనలతో పాటు భారీ పెట్టుబడులు, భూ కేటాయింపులు, ఇంధన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ (Green Signal) ఇచ్చారు. విడాకుల ప్రకటన వెలువడిన మరుసటి రోజే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు.
2026-31 కాలానికి ఏపీ ఏవీజీసీ-ఎక్స్ఆర్ పాలసీ(AP AVGC-XR Policy), 2036 వరకు రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ పాలసీ (Robotics Policy ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సెమికండక్టర్, డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ-4.0లో సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విశాఖ జిల్లా భీమిలి మండలం అమనాంలో ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్(AM Intelligence Labs) రూ.31,387 కోట్లతో 512 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ (AI Data Center) ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా వెయ్యి ఉద్యోగాలు లభించనున్నాయి. రాంబిల్లిలో ఈప్యాక్ సంస్థ (Epack Company) రూ.570.20 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,565 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.
తిరుపతిలో డిక్సన్ టెక్నాలజీస్‌కు (Dixon Technologies) భూ కేటాయింపును ఆమోదించారు. రూ.700 కోట్ల పెట్టుబడితో 2,300 ఉద్యోగాలు కల్పించనున్నారు. నాయుడుపేటలో కార్బన్ కాస్మో సంస్థ రూ.4 వేల కోట్లతో లిథియం బ్యాటరీ మెటీరియల్ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనపై చర్చించారు. అదానీ గ్రూప్ క్లౌడ్ హబ్ (Adani Group Cloud Hub)ప్రతిపాదనను కూడా పరిశీలించారు.
అన్నమయ్య జిల్లాలో 56.82 ఎకరాల్లో ఫుట్‌వేర్ కాంపొనెంట్ పార్కు, ఎన్టీఆర్ జిల్లా జయంతిపురంలో 30 ఎకరాల్లో మహిళా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ఎకరా రూ.35.31 లక్షల చొప్పున ప్లాట్లు కేటాయించనున్నారు.
పోలీస్ శాఖలో ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ సేఫ్టీ డైరెక్టరేట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిన్న మాడ్యులర్ రియాక్టర్ల సాంకేతికతతో అణు విద్యుత్ కేంద్రాల ప్రతిపాదనతో పాటు వివిధ జిల్లాల్లో బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
అలాగే టీటీడీలో(TTD) ప్రధాన సన్నిధి యాదవ, అదనపు సన్నిధి యాదవ పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తంగా భారీ పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలను ప్రోత్సహించడం, ఉద్యోగావకాశాలను పెంచడమే లక్ష్యంగా మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది.








