అధికారం ముసుగులో జనసేన పార్టీ (Jana Sena Party) నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. అరవ శ్రీధర్(Arava Sridhar), కిరణ్ రాయల్(Kiran Royal), జయప్రకాశ్ నాయుడు (Jayaprakash Naidu) వంటి జనసేన నేతల రాసలీలలు, మోసాలను ప్రజలింకా మరువక ముందే తాజాగా మరో నాయకుడి బండారాన్ని బాధితురాలు (Victim Woman) బయటపెట్టింది. అధికారం వాళ్లదే కాబట్టి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తనకు న్యాయం జరగదు కాబట్టే మీడియా ముందుకు వచ్చానని బాధితురాలు సంచలన ఆరోపణలు చేసింది.
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్ (Bethapudi Vijay Sekhar) రూ. కోట్లలో మోసానికి పాల్పడ్డారంటూ గుంటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మోదుగు సుమలత (Modugu Sumalatha) సంచలన ఆరోపణలు చేశారు. కాంట్రాక్టులు, క్వారీలు ఇప్పిస్తానని చెప్పి తన వద్ద నుండి కోటి 75 లక్షల రూపాయల నగదుతో పాటు భారీగా బంగారాన్ని కూడా లాక్కుని ఇప్పుడు మోహం చాటేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా సమయంలో (Corona Period) తనకు జనసేన రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్‌తో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని విజయ్ శేఖర్ ఆమెకు పెద్ద ఎత్తున ఆశలు చూపించారని తెలిపింది. “రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా మన ప్రభుత్వమే (కూటమి) అధికారంలోకి వస్తుంది.. జనసేన(Jana Sena) కీలక పాత్ర పోషిస్తుంది” అని నమ్మబలికాడు. 2024లో ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఇసుక క్వారీలు(Sand Quarries, గ్రానైట్ వ్యాపారాలు(Granite Businesses), వైన్ షాపుల (Wine Shops) కాంట్రాక్టులన్నీ మనకే వస్తాయని, వాటిలో భాగస్వామ్యం కల్పిస్తానని సుమలతను నమ్మించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
రాజకీయ పలుకుబడిని చూపిస్తూ విజయ్ శేఖర్ చెప్పిన మాటలను నమ్మి దఫదఫాలుగా దాదాపు రూ.1,75,00,000 నగదును విజయ్ శేఖర్‌కు అప్పగించానని తెలిపింది. అంతటితో ఆగకుండా, డబ్బు సరిపోవడం లేదంటూ తన 228 గ్రాముల బంగారాన్ని సైతం బలవంతంగా తాకట్టు పెట్టించి ఆ డబ్బును కూడా ఆయనే తీసుకున్నట్లు బాధితురాలు ఆరోపించారు.
తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ్ శేఖర్ అసలు స్వరూపం బయటపడిందని బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధికారంలోకి రాగానే మోహం చాటేసిన విజయ్ శేఖర్.. తన డబ్బు ఇవ్వమని అడిగితే తనపై దాడికి చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు జనసేన అధిష్టానం న్యాయం చేయాలని వేడుకుంది. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
మరో @JanaSenaParty నాయకుడి బాగోతం బట్టబయలు
— Telugu Feed (@Telugufeedsite) June 11, 2026
జనసేన నేత చేతిలో మోసపోయానంటూ మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు
ఇసుక క్వారీలు , గ్రానైట్ ,వైన్ షాపులు మనవేనని నమ్మించి జనసేన రాష్ట్ర పార్టీ కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్ తనను మోసం చేశాడన్న మహిళ
తన వద్ద నుంచి రూ.1.75 కోట్ల నగదు… https://t.co/E3KaCBESQn pic.twitter.com/MQsuFHb4YU








