మ‌నిషి ప్రాణం విలువ రూ.3.5 ల‌క్ష‌లు.. తిరుపతి జిల్లాలో ‘కూటమి’ సెటిల్‌మెంట్‌!

మ‌నిషి ప్రాణం విలువ రూ.3.5 ల‌క్ష‌లు.. తిరుపతి జిల్లాలో కూటమి నేతల సెటిల్‌మెంట్‌!

Summarize with AI

తిరుపతి (Tirupati) జిల్లాలో పోలీసుల కస్టోడియల్ టార్చర్ (Police Custodial Torture) కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య (Suicide) చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. పోలీసులు కొట్ట‌డం వ‌ల్లే మ‌న‌స్తాపం చెందిన తమ తండ్రి చ‌నిపోయాడ‌ని పిల్ల‌లు చెబుతుంటే.. మరోవైపు బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం (Financial Assistance) పేరుతో సెటిల్‌మెంట్ (Settlement) పోలీసుల స‌మ‌క్షంలో కూట‌మి నాయ‌కులు (Alliance Leaders) సెటిల్‌మెంట్లు చేసిన వీడియో సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

వివ‌రాల్లోకి వెళితే.. తిరుప‌తి జిల్లా రాయలచెరువుకు చెందిన సుబ్రమణ్యం (Subramanyam) అనే వ్యక్తిపై జనసేన(Jana Sena) మండల అధ్యక్షుడు సంజీవి హరి(Sanjeevi Hari), ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు సుబ్రమణ్యాన్ని అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టారని, ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

సుబ్రమణ్యాన్ని ఆయన భార్య, పిల్లల ఎదుటే లాఠీలతో (Lathis) తీవ్రంగా కొట్టారని, మర్మాంగాలపై (Private Parts) కూడా దాడి చేశారని చెబుతున్నారు. అడ్డుగా వచ్చిన చిన్నారిని కూడా కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుబ్రమణ్యం అనంతరం ఆత్మహత్య చేసుకున్నారని వారు పేర్కొంటున్నారు.

ఈ ఘటన తర్వాత బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించే పేరుతో సెటిల్‌మెంట్‌కు ప్రయత్నాలు జరగ‌డం సంచ‌ల‌నంగా మారింది. పరిహారం పేరుతో టీడీపీ(TDP) నాయకులు, పోలీసులు కలిసి పంచాయితీ చేశారు. క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ భ‌రించ‌లేకి సుబ్ర‌మ‌ణ్యం చ‌నిపోయార‌ని ఓ ప‌క్క కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తుంటే.. ఈ నెపం జనసేన మండల అధ్యక్షుడు సంజీవి హరిపై మోపేందుకు ప్రయత్నించడం సంచ‌ల‌నంగా మారింది.

జనసేన మండల అధ్యక్షుడు సంజీవి హరి ద్వారా మృతుడి కుటుంబానికి రూ.3.50 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరుతూ, రెండు ప్రామిసరీ నోట్లపై బలవంతంగా సంతకాలు చేయించిన‌ట్లు వీడియోలో క్లియ‌ర్‌గా క‌నిపిస్తోంది. ఒక ప్రామిసరీ నోటుపై (Promissory Note) రూ.2 లక్షలు, మరో నోటుపై రూ.1.50 లక్షల మొత్తానికి సంతకాలు చారు.

సంతకాలు చేసేందుకు సంజీవి హరి (Sanjeevi Hari) తొలుత వెనుకడుగు వేయగా, “ఏం కాదు.. నా మాట విను” అంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. ఆఖ‌రికి జ‌న‌సేన నేత‌తో సంత‌కం పెట్టించారు. క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ సూసైడ్ కేసును పోలీసులు ద‌గ్గ‌రుండి మ‌రీ కూట‌మి నేత‌ల‌తో క‌లిసి సెటిల్‌మెంట్ చేయించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వ్యవహారం ఇప్పుడు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment