విషాదం : ఆల‌యంలో తొక్కిస‌లాట‌.. ఆరుగురు మృతి

విషాదం : ఆల‌యంలో తొక్కిస‌లాట‌.. ఆరుగురు మృతి

Summarize with AI

అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన ఆరుగురు భ‌క్తులు ఆల‌యంలో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న గోవా (Goa) లో క‌ల‌క‌లం సృష్టించింది. గోవాలోని శిర్గావ్‌ (Shirgaon) లోని లైరాయ్ (Lairai) ఆల‌యంలో(Temple) శుక్ర‌వారం న‌వ‌రాత్రి ఉత్స‌వాలు (Navaratri Festivities) ప్రారంభ‌మ‌య్యాయి. అమ్మవారిని ద‌ర్శించుకునేందుకు గోవా న‌లుమూల‌ల నుంచి భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. అమ్మ‌వారికి మొక్కులు చెల్లించుకున్నారు.

న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా రెండో రోజు భ‌క్తులు నింపుల గుండంలో న‌డవ‌డం ఆన‌వాయితీ. శ‌నివారం తెల్ల‌వారుజామున ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. ప‌రిస్థితి ఒక్క‌సారిగా అదుపుత‌ప్ప‌డంతో ఆలయంలో తొక్కిసలాట (Stampede) జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు భక్తులు (Six Devotees)మృతి చెందారు (Died). ఈ ఘటనలో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

ఘటనా స్థలానికి పోలీసు, రెస్క్యూ బృందాలు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నాయి. అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. తొక్కిసలాట ఘ‌ట‌న‌పై గోవా సీఎం (Chief Minister) ప్రమోద్‌ సావంత్ (Pramod Sawant) స్పందించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్ష‌త‌గాత్రుల‌ను, మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment