ఆగ‌ని దారుణాలు.. యువ‌తిపై క‌త్తితో దాడి

ఆగ‌ని దారుణాలు.. యువ‌తిపై క‌త్తితో దాడి

Summarize with AI

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ప్రేమోన్మాదుల‌ దాడులు విప‌రీత‌మ‌య్యాయి. ప్రేమ పేరుతో యువ‌తుల‌ను వేధిస్తూ.. వారి ప్రేమ‌ను నిరాక‌రిస్తే.. హ‌త్య చేసేందుకు కూడా వెన‌కాడ‌కుండా ఉన్మాదులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విశాఖ మ‌ధుర‌వాడ‌ (Madhurawada) లో రెండ్రోజుల క్రితం జ‌రిగిన ఘ‌ట‌న‌ను మ‌రువ‌క ముందే విజయనగరం (Vizianagaram) జిల్లా గరివిడి మండలం శివరాం (Shivaram) గ్రామంలో మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకుంది. అఖిల (Akhila) అనే యువతిపై కత్తితో దాడి (Knife Attack) జరిగిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

ఒక దుండగుడు మంకీ క్యాప్ ధరించి అఖిల ఇంట్లోకి చొచ్చుకెళ్లాడు. ఆమె కడుపులో కత్తితో పొడిచాడు. అఖిల కేకలు విన్న స్థానికులు అప్ర‌మ‌త్త‌మ‌య్యేలోపే దుండగుడు పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన అఖిల అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు తక్షణమే విజయనగరం ఆస్పత్రికి తరలించారు.

అఖిలపై దాడి ఘ‌ట‌న‌లో పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రేమ వ్యవహారమేనా లేదా మరో కారణమా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment