కోహ్లి రీఎంట్రీ.. జైశ్వాల్ జట్టుకు దూరమా?

కోహ్లి రీఎంట్రీ.. జైశ్వాల్ జట్టుకు దూరమా?

Summarize with AI

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి గాయం నుంచి కోలుకుని మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించాడు. నాగ్‌పూర్‌లోని తొలి వన్డే నెట్స్ సెషన్‌లో, బ్యాటింగ్ చేస్తుండగా కాలి మోకాలికి గాయమైన విషయం తెలిసిందే. అయితే, కోహ్లి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడని, కటక్ వేదికగా జరగనున్న రెండో వన్డేకు అందుబాటులోకి రానున్నాడని సమాచారం.

కోహ్లి తిరిగి జట్టులోకి రానుండటంతో, యువ బ్యాట్స్‌మన్ యశస్వి జైశ్వాల్‌ స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే జట్టులో టాప్-ఆర్డర్‌లో గట్టి పోటీ నెలకొనడంతో, యశస్వికి తాత్కాలికంగా చోటు దక్కకపోవచ్చు. అయితే, అతని ప్రతిభను బట్టి మరో అవకాశమొస్తుందనే నమ్మకం అభిమానుల్లో నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment