కందిలోని ఐఐటీ హైదరాబాద్లో నేడు (ఆదివారం) భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తితో కలిసి హెలిపాడ్, సమావేశ స్థలాలను పరిశీలించారు. అధికారులకు, భద్రతా ఏర్పాట్లకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా కఠిన ఆదేశాలు ఇచ్చారు.
మూడంచెల భద్రత..
ఉపరాష్ట్రపతి పర్యటన కోసం 550 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. హెలిపాడ్, వీఐపీ పార్కింగ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వంటి ప్రదేశాల్లో భద్రతను మరింత కఠినతరం చేశారు. ఆదివారం సాయంత్రం వరకు క్రషర్, మొరం వాహనాలను సంగారెడ్డిలోకి అనుమతించబోమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.








