అసలైన బ్లాస్ట్ కోసం వెయిట్ చేయండి.. ‘వారణాసి’ టీమ్ నుంచి క్రేజీ అప్డేట్!

అసలైన బ్లాస్ట్ కోసం వెయిట్ చేయండి.. ‘వారణాసి’ టీమ్ నుంచి క్రేజీ అప్డేట్!

Summarize with AI

సూపర్‌స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (S.S. Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్‌వరల్డ్ చిత్రం ‘వారణాసి’పై(Varanasi) సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేఎల్ నారాయణ(K.L. Narayana), ఎస్‌.ఎస్‌. కార్తికేయ (S.S. Karthikeya) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్‌ను చిత్రబృందం వెల్లడించింది. సినిమా షూటింగ్(Shooting) పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని ప్రకటించింది. సీజీ వర్క్స్, రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయని, త్వరలో డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని తెలిపింది. అయితే ఇది కేవలం ఒక అప్డేట్ మాత్రమేనని, అసలైన సర్‌ప్రైజ్ కోసం అభిమానులు మరికొంతకాలం వేచి చూడాలని చిత్రబృందం పేర్కొంది. దీంతో మహేశ్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

ప్రపంచంతో పాటు కాలాన్ని చుట్టేసే ఓ సాహసికుడి కథాంశంతో ‘వారణాసి’ తెరకెక్కుతోంది. ఇందులో మహేశ్ బాబు రుద్రగా, శ్రీరాముడిగా రెండు విభిన్న పాత్రల్లో(Dual Roles) కనిపించనుండగా.. ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో అలరించనున్నారు. ఎం.ఎం. కీరవాణి (M.M. Keeravani) సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాత్రల పరిచయాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ సహా ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో తదుపరి అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment